sarainodu blockbuster full song with lyrics

Sarainodu blockbuster full song with lyrics

Allu Arjun, Allu Arjun Sarainodu, Allu Arjun with Boyapati, Sarinodu, blockbuster song, Anjali in Sarinodum Thaman

Allu Arjuns Sarainodus item number Blockbuster full version out now. Lahari music releasing directly into the market, Sarainodu songs on April 1.

సరైనోడు బ్లాక్ బస్టర్ ఫుల్ సాంగ్.. ఏప్రిల్ 1న ఆడియో

Posted: 03/29/2016 11:00 AM IST
Sarainodu blockbuster full song with lyrics

తెలుగు, మళయాళం, తమిళ ఇండస్ట్రీల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని.. స్టార్ హీరో. తాజాగా ఎనర్జిటిక్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో సరైనోడుగా మన ముందుకు రాబోతున్నారు. అల్లు అర్జున్ కు మాస్ ఇమేజ్ ను అందించేలా ఈ సినిమా రూపొందుతోంది. కాగా ఈ సినిమాలోని ఐటం సాంగ్ బ్లాక్ బస్టర్ టీజర్ ను రెండు రోజలు క్రితం అల్లు అర్జున్ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా విడుదల చేశారు. టీజర్ తోనే ఆకట్టుకున్న ఈ పాట.. లిరిక్స్  తో కూడిన ఫుల్ పాట మార్కెట్ లోకి వచ్చేసింది. లహరి మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదలైంది.

బ్లాక్ బాస్టర్ బ్లాకు బాస్టరే.. నే చెయ్యి వేస్తే నీ లైఫే బ్లాక్ బస్టరే అంటూ సాగే ఈ పాటలో అంజలి చిలకలూరి చింతామణిగా అదిరిపొయే డ్యాన్స్ చేసిందట. ఇక అల్లు అర్జున్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎనర్జిటిక్ లెవల్స్ ను పెంచుతూ సాగిన ఈ పాట మాస్ లోకి బాగా దూసుకెళుతోంది. కాగా ఏప్రిల్ ఒకటిని సరైనోడు పాటలను లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్ లోకి విడుదలచెయ్యనున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా మొదటి పాట బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలోని మిగిలిన పాట కోసం అభిమానుల ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వేసవిలోనే అల్లు అర్జున్ సరైనోడుగా మన ముందుకు రాబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles