Sashikala | release date | stills | posters

Sashikala film release on 25 march

Sashikala release on 25 march, Sashikala stills, Sashikala movie stills, Sashikala movie updates, Sashikala posters, Sashikala

Sashikala film release on 25 march: tamil hit film mooch release in to telugu as sashikala. this film will be release on 25 march.

‘శశికళ’గా వస్తున్న తమిళ మూచ్

Posted: 03/18/2016 10:13 AM IST
Sashikala film release on 25 march

గతేడాది తమిళంలో ఘన విజయం సాధించిన హారర్ చిత్రాల్లో "మూచ్" ఒకటి. ఈ చిత్రాన్ని తెలుగులో "శశికళ" పేరుతో అనువదిస్తున్నారు భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారాయన. జయరాజ్, నితిన్ రాజ్, మిషా ఘోషల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వినుభారతి దర్శకుడు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ.. "తమిళంలో మంచి విజయం సాధించిన చిత్రమిది. ఆద్యంతం ఉత్కంఠ గొలుపుతూ.. భయపెడుతూనే వినోదం అందించే హారర్ ఎంటర్ టైనర్ ఇది. ప్రఖ్యాత దర్శకుడు భారతిరాజా సోదరుడు జయరాజ్ ఓ ముఖ్య పాత్ర పోషించిన ఈ చిత్రానికి భారతిరాజా శిష్యుడు విను భారతి దర్శకత్వం వహించారు. హారర్ చిత్రాలను ఆదరించేవారందరికీ "శశికళ" అమితంగా నచ్చుతుంది" అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వెంకటేష్, ఎడిటింగ్: శివ వై. ప్రసాద్, సంగీతం: నిత్యన్ కార్తీక్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: విను భారతి!!

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sashikala  release date  stills  posters  

Other Articles