Trisha | Nayaki | Motion Poster | Stills | Nayagi

Nayaki teaser

Trisha Nayaki Teaser, Trisha Nayaki Motion Song Poster, Trisha Nayaki Poster, Trisha latest movie news, Trisha Nayaki movie news, Trisha Nayaki stills, Trisha latest news, Trisha movie news, Trisha movie updates, Trisha stills, Trisha

Nayaki Teaser: Nayaki Telugu Movie Official Teaser ft Trisha, Brahmanandam and Satyam Rajesh. Music composed by Raghu Kunche. Directed by Govi Goverdhan and produced by Giridhar Mamidipally.

చీరకట్టి, కత్తిపట్టి చంపేసిన ‘నాయకి’

Posted: 03/17/2016 06:26 PM IST
Nayaki teaser

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న తొలి హర్రర్ చిత్రం ‘నాయకి’. తమిళంలో ‘నాయగి’ పేరుతో రూపొందిస్తున్నారు. ‘she watches U and catch U’ అనేది ట్యాగ్ లైన్. ‘లవ్ యు బంగారమ్’ ఫేమ్ గోవి దర్శకత్వంలో ‘లక్ష్మిరావే మా ఇంటికి’ సినిమాను నిర్మించిన మామిడిపల్లి గిరిధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో త్రిష చాలా క్యూట్ గా వుండటంతో పాటు, కాస్త కన్నింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో త్రిష హీరోయిన్ పాత్రలో నటిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఏదో రివేంజ్ డ్రామా తరహాలో ‘నాయకి’ చిత్రం రూపొందుతున్నట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హర్రర్, థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ఆడియోను మార్చి నెల చివర్లో విడుదల చేసి, ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో గణేష్ వెంకట్రామన్, బ్రహ్మానందం, జీవీ, సత్యంరాజేష్, జయ ప్రకాష్, సుష్మరాజ్, కోవై సరళ, మనోబాల తదితరులు తారాగణం. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జగదీష్ చీకటి, సంగీతం: రఘు కుంచె, పాటలు: భాస్కరభట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంబాబు కుంపట్ల, కళ కె.వి.రమణ, కూర్పు: గౌతంరాజు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Nayaki  Teaser  Posters  stills  

Other Articles