Sudheer Babu | Baaghi | Trailer | Tiger Shroff | Shraddha Kapoor | Stills

Sudheer babu happy with baaghi responce

Sudheer Babu Happy with Baaghi Trailer Responce, Baaghi Trailer, Baaghi stills, Baaghi movie trailer, Tiger Shroff Baaghi trailer, Baaghi movie updates, Baaghi release date, Baaghi

Sudheer Babu Happy with Baaghi Responce: starring Tiger Shroff and Shraddha Kapoor and directed by Sabbir Khan. The film releases on April 29, 2016.

సుధీర్ కోసం బాలీవుడ్ సినీ జనాల ఆరాటం

Posted: 03/15/2016 07:12 PM IST
Sudheer babu happy with baaghi responce

తెలుగులో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న సుధీర్ బాబు.. ఈ మధ్య చిన్న సినిమాలతో మంచి విజయాలను దక్కించుకుంటున్నాడు. నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నప్పటికీ.. సరైన హిట్టు దొరకక ఇంకా స్టార్ క్రేజ్ ను దక్కించుకోలేకపోతున్నాడు.

తెలుగులో రానీ స్టార్ క్రేజ్ బాలీవుడ్ లో ఒక్క ట్రైలర్ వల్ల సుధీర్ కు వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా ఏంటనీ అనుకుంటున్నారా... తెలుగులో ప్రభాస్, త్రిష, గోపిచంద్ ప్రధాన పాత్రలలో నటించిన ‘వర్షం’ చిత్రాన్ని హిందీలో ‘భాగీ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. స్టోరీ లైన్ ‘వర్షం’ సినిమాకు దగ్గరగా వున్నప్పటికీ... కథనం మాత్రం పూర్తిగా మార్చేసి, ఒరిజినల్ వర్షెన్ కు ఎలాంటి సంబంధంలేదనిపించే విధంగా ‘భాగీ’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇందులో గోపిచంద్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ ట్రైలర్ లో సుధీర్ బాడీ, యాక్టింగ్ లుక్స్ వల్ల బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇపుడు ఎక్కడ చూసిన సుధీర్ లుక్స్ గురించే చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో రేంజులో అదిరిపోయే బాడీ ఫిట్ నెస్ తో, స్టైలిష్ యాక్షన్ విలన్ గా ఇందులో అదరగొట్టాడు.

కేవలం ఒక్క ట్రైలర్ తో ప్రస్తుతం సుధీర్ బాలీవుడ్ లో భారీ క్రేజ్ ను దక్కించుకున్నాడు. సుధీర్ బాబు ఎవరంటూ బాలీవుడ్ జనాలు ఆరా తీయడం మొదలెట్టేసారు. మొత్తానికి సుధీర్ కు తెలుగులో రానీ క్రేజ్ బాలీవుడ్ లో ‘భాగీ’ వల్ల వచ్చేసింది. మరి ఈ సినిమా విడుదలైతే బాలీవుడ్ లో ఇంకెన్ని ఆఫర్లు వచ్చిపడతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Baaghi  Trailer  Tiger Shroff  Shraddha Kapoor  Sudheer Babu  stills  

Other Articles