Tamanna | interview | Oopiri | Nagarjuna | Karthi

Tamanna talks about nagarjuna in oopiri

Tamanna interview on Oopiri, Tamanna talks about Oopiri, Oopiri release date, Tamanna latest stills, Tamanna 2016, Oopiri songs, Oopiri posters, Nagarjuna, karthi, tamanna

Tamanna talks about Nagarjuna in Oopiri: starring akkineni nagarjuna, karthi, tamanna acts in lead roles. Vamsi paidipally director, gopi sunder music. pvp producer.

నాగార్జున నటనపై మిల్కీబ్యూటీ ప్రశంసలు

Posted: 03/15/2016 06:43 PM IST
Tamanna talks about nagarjuna in oopiri

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ‘ఊపిరి’. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శక‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా, ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రానికి గోపిసుందర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ‘ఊపిరి’ విడుదల తేది దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారు.

ఈ సంద‌ర్భంగా మిల్కీబ్యూటీ త‌మ‌న్నా మాట్లాడుతూ... నా క్యారెక్టర్ పేరు కీర్తి. బిలియ‌నీర్ పి.ఎ కాబ‌ట్టి బాగా చ‌దువుకుని బాధ్యత గ‌ల అమ్మాయిగా క‌నిపిస్తాను. అలాగే స్ట్రాంగ్ ఉమెన్ ఎలా ఉంటుందో అలా నా క్యారెక్టర్ ఉంటుంది. ఇది రీమేక్ కాదండి. ఫ్రెంచ్ మూవీ ది ఇన్ ట‌చ్ బుల్స్ సినిమా స్పూర్తితో తీసిన సినిమా ఇది. ఓరిజిన‌ల్ ఎలా ఉందో అలా తీస్తే ఇక్కడ యాక్సప్ట్ చేయ‌రు. అందుచేత ఇండియ‌న్ ఆడియోన్స్ కి త‌గ్గట్టు మార్పులు చేసారు. ఇంకా చెప్పాలంటే ఈ సినిమాకి భాష అవ‌స‌రం లేదు. ఒరిజినల్ వెర్షన్ మూవీ నేను చూడలేదు. కాక‌పోతే నా క్యారెక్ట‌ర్ లో చాలా మార్పులు చేశారు.

తెలుగులో డ‌బ్బింగ్ చెబితే బాగుంటుంద‌ని నా మ‌న‌సులో మాట‌ను డైరెక్టర్ వంశీకి చెప్పాను. వెంట‌నే వంశీ ఓకే అన్నారు. భవిష్యత్ లో పాత్ర డిమాండ్ చేస్తే డబ్బింగ్ చెబుతాను. నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ చేయ‌డం చాలా క‌ష్టం. కాళ్ళు చేతులు కదపకుండా కేవలం ఎక్స్ ప్రెష‌న్స్ మాత్రమే ఇవ్వాలంటే మామూలు విష‌యం కాదు. నాగార్జున గారు ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ క్యారెక్టర్ చేసారు. ఆయ‌న్ని చూసి చాలా మంది న‌టులు స్పూర్తి పొందుతారు. తెలుగు సినిమాని ‘ఊపిరి’ మార్చేస్తుంది.

బాహుబ‌లి2లో నా క్యారెక్టర్ త‌క్కువుగానే ఉంటుంది. షూటింగ్ ఎప్పుడు ఎక్కడ అనేది ఇంకా తెలియ‌దు. ఇలాంటి సినిమాలో పాత్ర నిడివి చిన్నదా..? పెద్దదా అని కాదు న‌టించ‌డ‌మే గ్రేట్ అని నా ఫీలింగ్. ఇంకా త‌మిళంలో ధ‌ర్మదొరై మూవీ చేస్తున్నాను. బాహుబ‌లి2 చేస్తున్నాను. ప్రభుదేవా రూపొందిస్తున్న త్రిభాషా చిత్రంలో న‌టిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oopiri  Tamanna  Interview  Nagarjuna  Karthi  stills  

Other Articles