Nandamuri Brothers shaking south indian cinema

Nandamuri brothers shaking south indian cinema

Nandamuri Family, NTR, Nandamuri KalyanRam, Kalyan Ram, Junior NTR

Nandamuri Brothers Junior NTR and Nandamuri Kalyan Ram full in swing. their cinemas goibg to remake in tamila and malayam.

సౌత్ ను షేక్ చేస్తున్న నందమూరి బ్రదర్స్

Posted: 03/11/2016 11:43 AM IST
Nandamuri brothers shaking south indian cinema

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫేట్ చాలా మారిపోయింది.ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎన్టీఆర్ హ‌వానే న‌డుస్తుంది.ఏ నోట విన్న తార‌క్ క‌బుర్లే వినిపిస్తున్నాయి. గ‌తంలో వ‌చ్చిన టెంప‌ర్ సినిమాతో హిట్ అందుకున్న తార‌క్, అప్పటి నుండి వెను తిరిగి చూసుకోకుండా స‌క్సెస్‌ఫుల్ కెరియ‌ర్ ర‌న్ చేస్తున్నాడు. ఇటీవ‌ల సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన నాన్నకు ప్రేమ‌తో చిత్రం బ్లాక్‌బ‌స్టర్ హిట్ కావ‌ట‌మే కాకుండా తన‌కు ఇప్పటి వ‌ర‌కూ లేని 50కోట్ల రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు తార‌క్‌.

ఇదిలావుంటే ప్రస్తుతం తార‌క్ టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో జ‌న‌తాగ్యారేజ్ చిత్రంలో న‌టిస్తున్నాడు.ప్రస్తుతం ఈ చిత్రం సౌత్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ సినిమాను మలయాళంలో భారీ ఎత్తున విడుదల చేయడం ఖాయమైంది. ఆ సినిమా డబ్బింగ్ హక్కులు బాహుబలికి మించిన స్థాయిలో అమ్ముడుపోయాయి. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటిస్తున్న ఈ సినిమా కోసం మలయాళీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటు చూస్తే క‌న్నడ‌లో సైతం త‌న స‌త్తా చాటుతున్నాడు యంగ్ టైగ‌ర్‌.క‌న్నడ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చ‌క్రవ్యూహ్ సినిమా కోసం తార‌క్ ఓ సాంగ్ పాడాడు.అయితే ఇటీవ‌ల రిలీజ్ అయిన‌ ఈ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డ్స్ క్రియేట్ చేయ‌టం విశేషం. దీంతో కన్నడ నాట ఎన్టీఆర్ రచ్చ చేస్తున్నాడు. ఇక ‘టెంపర్’ తమిళ రీమేక్ ను శింబు చేయనున్నాడు. ఎంతైనా ఇది జూనియర్ కు గర్వకారణమే.ఇదే సమయంలో కళ్యాణ్ రామ్ బ్లాక్‌బ‌స్టర్ సినిమా ‘పటాస్’ తమిళ రీమేక్ విడుదలకు సిద్ధం అయ్యింది. దీంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ల సినిమాలకు సంబంధించిన వ్యవహారాలు ఒకేసారి సౌత్‌ను షేక్ చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nandamuri Family  NTR  Nandamuri KalyanRam  Kalyan Ram  Junior NTR  

Other Articles