AR Rehaman turned into Producer

Ar rehaman turned into producer

99songs, AR Rehaman, Rehaman, AR Rehaman latest film

famous Music Director AR Rehaman turned as Cinema Producer. He is producing a filmed named as 99 songs.

ప్రొడ్యూసర్ గా మారిన ఎ.ఆర్ రెహమాన్

Posted: 03/11/2016 07:47 AM IST
Ar rehaman turned into producer

ఆస్కార్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ నిర్మాతగా మారారు. అంతేకాదు ఆ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇప్పుడు స్క్రీప్ట్ రైటర్‌గా కూడా టాలెంట్ చూపించనున్నారు. '99 సాంగ్స్' టైటిల్‌తో వస్తున్న ఆ పోస్టర్‌ను రెహ్మాన్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ రొమాంటిక్ ఫిల్మ్ పోస్టర్‌ను ఆకర్షణీయంగా తయారు చేశారు. ఆకాశంలో వేలాడుతున్న పియానోను ఓ జంట పట్టుకుని వేలాడుతుంది. తొలుత ఈ మూవీని రెహ్మాన్ డైరక్షన్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడా బాధ్యతలను విశ్వేష్ కృష్ణమూర్తికి అప్పగించారు. టీవీ డాక్యుమెంటరీ 'ద దివారిస్ట్స్' తీసిన విశ్వేష్ ఇప్పుడు రెహ్మాన్ సబ్జెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారు.

రెహమాన్ నిర్మాణసారద్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొత్తం పది పాటలు ఉంటాయి. వైఎం మూవీ బ్యానర్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఓ గాయకుడి కథా నేపథ్యంతో ఫిల్మ్‌ను రూపొందిస్తున్నారు. '99 సాంగ్స్' ఓ సున్నితమై కథ అని, ఓ కళాకారుడి జీవన ప్రయాణం ఆ మూవీలో దర్శనమిస్తుందని రెహ్మాన్ అన్నారు. మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఫిల్మ్ కోసం రెహ్మాన్ ఇప్పటికే అయిదు గీతాలకు సంగీతాన్ని సమకూర్చారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

'' మీ అందరి సహకారం, ఆశీస్సులతో .. నా సినిమా మొదటి పోస్టర్.. షేర్ చేస్తున్నా' అని ఆయన ట్వీట్ చేశారు అటు ఈ సినిమా దర్శకుడు ముఖేస్ చాబ్రా కూడా ఈ పోస్టర్ ను తన ట్విట్టర్ పోస్ట్ చేశారు. రెహమాన్ చిత్రంలో భాగస్వామి కావడం తనకు గొప్ప అనుభవాన్ని మిగిల్చిందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 99songs  AR Rehaman  Rehaman  AR Rehaman latest film  

Other Articles