Sardar Gabbar singh photo leaked in Internet

Sardar gabbar singh photo leaked in internet

Pawan Kalyan, pawan kalyan sardar, Sardar Gabbar Singh, Pawan Kalyan movie, Pawan Kalyan News, Sardar Stills, Sardar Posters

Sardar Gabbar singh photo leaked in Internet.. Pawan Kalyan fans celebrated for that. They hope that as Attarintiki daredi centiment will repeats once again.

నెట్ లో సర్దార్ లీక్ ఫోటో హల్ చల్.. అలర్ట్ చేసిన పవన్ కళ్యాణ్

Posted: 03/07/2016 12:48 PM IST
Sardar gabbar singh photo leaked in internet

తెలుగు సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అయితే గతంలో అత్తారింటి దారేది సినిమా రిలీజ్ కు ముందే ఇంటర్నెట్ లో లీక్ కావడం సంచలనం రేపింది. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ సినిమాకు కూడా అలాంటి లీకేజీ బెడదపట్టుకుంది. పవన్ కళ్యాణ్ తాజా మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ స్క్రీన్‌షాట్ ఒకటి ఇంటర్నెట్‌లో లీకయింది. దీంతో యూనిట్ షాక్‌కి గురైంది. అయితే ఇది ఎడిటింగ్ టేబుల్ వద్ద తీసిన ఫోటో అని ఆ తర్వాత తెలిసినా.. ఇది ఎలా లీకయిందో తెలియక యూనిట్ తల పట్టుకుంటోంది. ఇంకా సీక్రెట్‌గా ఉండే ఈ మూవీ రఫ్ ఫుటేజీ కూడా బయటకు పొక్కితే ఇంకేమైనా ఉందా అని సర్దార్ క్యాంప్ కలవరపడుతోంది.

గతంలో పవన్ సినిమా ‘అత్తారింటికి దారేది’ సీన్స్ కూడా ముందుగానే లీక్ అయి పెద్ద దుమారాన్నే సృష్టించాయి. ఇప్పుడు దాదాపు అలాంటిదే జరగడం కాస్త ఆందోళనకరమైన విషయమే. దీంతో మూవీ పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ల వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. ఈ తాజా పరిణామం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడని, మరింత అలర్ట్ గా ఉండాల్సిందిగా సూచించాడని తెలిసింది. గతంలో అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలాంటి లీకేజీ సమస్యను ఎదుర్కొన్నా కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం రికార్డు స్థాయి కలెక్షన్ లు తీసుకువచ్చి.. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే గ్రేట్ అసెట్ గా నిలిచింది. ఇప్పుడు సర్దార్ కూడా అలాగే నిలుస్తుందని అభిమానులు కొంత మంది పాజిటివ్ గా తీసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles