Mega Star Chiranjeevis second daughter Sreeja wedding venue may fix

Mega star chiranjeevis second daughter sreeja wedding venue may fix

Chiranjeevi, Chiranjeevis family, Mega Star Chiranjeevi, Sreeja, Sreeja Marriage, Chiranjeevi Daghter Sreeja Marriage

Mega Star Chiranjeevis second daughter Sreeja wedding venue may fix. Chiranjeevis second daughter marriage event may place in Bangalore.

చిరంజీవి చిన్న కూతరు పెళ్లి వేదిక అదేనట

Posted: 03/07/2016 12:19 PM IST
Mega star chiranjeevis second daughter sreeja wedding venue may fix

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు పెళ్లి ఎక్కడ చేయాలో తెలియక తికమక పడుతున్నారు అని వార్తలు వచ్చాయి. కానీ మొత్తానికి శ్రీజ పెళ్లి ఎక్కడ నిర్వహించాలో వేదిక ఫైనల్ అయిపోయిందట. ముందు హైద్రాబాద్ తర్వాత తిరుపతి - ఆ తర్వాత చెన్నై - నెక్ట్స్ రాజస్థాన్.. ఇలా అనేక ప్లేసులు అనుకున్న తర్వాత.. డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ జరగనున్న శ్రీజ-కళ్యాణ్ ల వివాహ వేడుకకు వేదికను ఫైనల్ చేశారు. మార్చి 28న :శ్రీజ పెళ్లి వేడుక ఉందని టాక్. అయితే పెళ్లి తేదీపైన ఎలాంటి క్లారిటీ లేదు. కాగా మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు పెళ్లి వేడుకకు వేదిక మాత్రం ఖరారైందని తెలుస్తోంది.

బెంగళూరులోని ఓ ఫాం హౌజ్ లో అత్యంత వైభవంగా తన చిన్న కూతురు పెళ్లి చేయబోతున్నారు చిరంజీవి. చిన్ననాటి నుంచి స్నేహితులైన కళ్యాణ్ - శ్రీజలు.. ఇప్పుడు దంపతులు కాబోతున్నారు. అనేక సంవత్సరాలపాటు వీరు స్కూల్ లో కలిసి చదువుకున్నారు కూడా. ఇప్పటికి వీరిద్దరు మంచి స్నేహితులు కావడంతో.. పెళ్లికొడుకు - పెళ్లికూతురు చాలా హ్యాపీగా ఉన్నారు. వీరిద్దరి తల్లులు కూడా 15 ఏళ్లుగా స్నేహితులు కావడం విశేషం. ఇప్పుడు బెంగళూరులో ఈ నెల 28న పెళ్లి వేడుక జరుగనుండగా.. ఒక రోజు ముందు భారీ ఎత్తున సంగీత్ నిర్వహించనున్నారు. మార్చ్ 27న జరిగే సంగీత్ లో డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా ఉంటాయట. కాగా బెంగళూరులో పెళ్లి వేడుక పూర్తయ్యాక.. హైద్రాబాద్ లో పెద్ద రిసెప్షన్ ఏర్పాటు చేయాలని చిరంజీవి నిర్ణయించారు. అయితే.. ఈ రిసెప్షన్ కి మాత్రం ఇంకా డేట్ ఫైనల్ చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles