NTR | Puneeth Rajkumar | Chakravyooha | GELEYA GELEYA Song

Ntr chakravyooha geleya geleya song launch date

NTR GELEYA GELEYA Song launch on 10 March, NTR sings for Puneeth Rajkumar 25th film, NTR sings for Puneeth, NTR sings for Puneeth film, NTR sings kannada song, NTR kannad song, NTR Puneeth Rajkumar 25th film, NTR latest tweets, NTR songs, NTR nannaku prematho, Puneeth Rajkumar

NTR Chakravyooha GELEYA GELEYA Song launch date: Young tiger NTR sings kannada song for Kannada powerstar Puneeth Rajkumar 25th film Chakravyooha. Thaman Music.

ఎన్టీఆర్ కన్నడ సాంగ్ కు ముహూర్తం ఖరారు

Posted: 03/03/2016 12:34 PM IST
Ntr chakravyooha geleya geleya song launch date

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈమధ్య తన సినిమాల్లో వరుసగా పాటలు పాడేస్తున్నాడు. ‘యమదొంగ’, ‘కంత్రి’, ‘రభస’, ‘నాన్నకు ప్రేమతో’ వంటి చిత్రాల్లో పాటలు పాడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా కన్నడ పవర్ స్టార్ సినిమా కోసం ఎన్టీఆర్ ఓ పాట పాడారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చక్రవ్యూహా’.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ తో తనకున్న స్నేహం వల్ల థమన్ ‘చక్రవ్యూహా’ సినిమాలో ఓ పాటను పాడించాడు. ఇటీవలే ఈ పాట కంపోజింగ్ పూర్తయ్యింది. ఈ పాటను మార్చి 10న విడుదల చేయనున్నారు. తాజాగా ఎన్టీఆర్, పునీత్ లు వున్న ఈ చిత్ర ఆడియో పోస్టర్ ను విడుదల చేసారు.

ఈ చిత్ర ఆడియో వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కన్నడలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి హ్యూమన్ బీయింగ్ వున్న కొంతమంది హీరోలలో పునీత్ రాజ్ కుమార్ ఒకరు. ‘చక్రవ్యూహా’ పునీత్ 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NTR  Puneeth Rajkumar  GELEYA GELEYA Song  Chakravyuha  Tweets  Stills  

Other Articles