Dasari Narayana Rao | compliments | Malupu | Collections

Dasari narayana rao compliments to malupu

Dasari compliments to Malupu, Malupu collections, Malupu movie updates, Malupu movie news, Malupu stills, Malupu trailers, Malupu movie

Dasari compliments to Malupu: The Telugu titan and legendary director Dasari Narayana Rao called upon the team of "Malupu" and appreciated their work.

‘మలుపు’పై దాసరి ప్రశంసల జల్లు

Posted: 03/02/2016 11:53 AM IST
Dasari narayana rao compliments to malupu

జంట తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణాల్లో వసూళ్ళతో పాటు థియేటర్ల సంఖ్యను కూడా పెంచుకుని ఆది నటించిన "మలుపు" చిత్రం బాక్సఫీస్‌ విజేతగా నిలిచింది. అన్ని వర్గాలనుండే కాకుండా ఈ చిత్రం విమర్శకుల నుండిసైతం ప్రశంసలనందుకుంటోంది. వీరి విజయహారంలోకి ఇప్పుడూ తాజాగా మరో కలికితురాయి చేరింది. టాలీవుడ్‌ సీనియర్‌ దర్శకుడు, అగ్రదర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు "మలుపు" చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా దర్శకరత్న దాసరి మొట్టమొదటిసారిగా తనకు తానుగా చిత్రబృందం కోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి, తానే వ్యాఖ్యతగా వ్యవహరించి "మలుపు" చిత్రనిర్మాణ విశేషాలను గురించి చర్చించారు. ఈ వీడియో త్వరలోనే మన ముందుకు రాబోతోంది.

అనూహ్యంగా లభించిన ఈ అపూర్వ గౌరవానికి, అభినందనలకు "మలుపు" చిత్రబృందం సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రసారహక్కులను ఓ ప్రముఖ టెలివిజన్‌ ఛానల్‌ వారు సొంతం చేసుకోవడానికి కూడా దాదాపుగా నిర్ధారణకు వచ్చినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. అలాగే బాలీవుడ్‌ కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణసంస్థవారు "మలుపు" సినిమా హిందీ రీమేక్‌ చేయడానికి కూడా సంప్రదింపులు జరుపుతున్నారు.

హీరో ఆది సరసన నిక్కి గల్రానీ నటించిన "మలుపు" చిత్రానికి నూతన దర్శకుడు సత్య ప్రభాస్‌ తొలిసారిగా దర్శకత్వం వహించారు. మరియు అలనాటి అగ్రదర్శకుడు రవిరాజా పినిశెట్టి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం నలుగురు స్నేహితుల జీవితాల్లో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా తయారవడం విశేషం. ప్రేక్షకులను ఆకట్టుకున్న "మలుపు" చిత్రం హౌస్ ఫుల్ గా నడుస్తూ విడుదలైన అన్నిచోట్లా మంచి రివ్యూలతో మరియు మంచి టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malupu  Dasari Narayana Rao  Collections  Compliments  

Other Articles