Nagarjuna | Karthi | Oopiri | Audio Launch | Tamannah | Anushka

Oopiri audio released

Oopiri Audio Launched, Oopiri Trailer, Oopiri Movie Release Date, Nagarjuna Oopiri movie shooting details, Oopiri movie news, Oopiri movie stills, Oopiri, Nagarjuna in Oopiri, Karthi Oopiri movie news, Oopiri movie posters, Karthi Oopiri first look, Tamannah latest stills, Tamannah hot news, Tamannah

Oopiri Audio Released: Oopiri has Nagarjuna and Karthi playing the lead roles ably supported by Tamannaah and others. Produced by PVP Cinema, Oopiri is directed by Vamsi Paidipally, Music by Gopi Sunder and Camera by P. S. Vinod.

గ్రాండ్ గా నాగార్జున, కార్తీల ‘ఊపిరి’ ఆడియో విడుదల

Posted: 03/02/2016 10:28 AM IST
Oopiri audio released

నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై 'బృందావనం' 'ఎవడు' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ‘ఊపిరి’. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది.

ఈ కార్యక్రమంలో కె.రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, అమల, కార్తీ, ప్రకాష్ రాజ్, జయసుధ, పివిపి,వంశీపైడిపల్లి, సుమంత్, గాబ్రియల్, జెమిని కిరణ్, కళ్యాణ్ కృష్ణ, ఎడిటర్ మధు, అశ్వనీదత్, సుశాంత్, హరీష్ శంకర్, అబ్బూరి రవి, రామజోగయ్యశాస్త్రి, దిల్ రాజు, రఘరాంరాజు, అడవి శేష్, శ్రీచరణ్, కాజల్ అగర్వాల్, దశరథ్, అలీ తదితరులు పాల్గొన్నారు. ఆడియో సీడీలను అక్కినేని అమల విడుదల చేశారు. ఆడియో సీడీలను అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ‘’’మనం’, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి వరుస విజయాలతో ప్రేక్షకులు నాపై ప్రేమను కురిపించారు. చైతన్య ఇప్పుడు ‘సాహసమే శ్వాసగా సాగిపో’ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఆ టైటిల్ నాకు ఎంతో ఇష్టమైన టైటిల్. ఎందుకంటే నేను సాహసంతో గీతాంజలి, నిన్నేపెళ్ళాడతా, అన్నమయ్య, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలు చేశాను. ‘ఊపిరి’ విషయానికి వస్తే ఇది పెద్ద జర్నీ. నాలుగేళ్ళ క్రితం నేను, అమల ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ‘ఇన్ టచ్ బుల్స్’ చూశాం. ఇద్దరికీ సినిమా బాగా నచ్చింది. ఈ సినిమాను ఎవరైనా తెలుగులో చేస్తే బావుంటుందని, అందులో నేను రోల్ చేస్తే బావుంటుందని అనుకున్నాను. గట్టిగా కోరుకుంటే జరుగుతుందని ఎవరో అన్నట్టు మూడేళ్ళ తర్వాత వంశీ ‘ఇన్ టచ్ బుల్స్’ సీడీ ఇచ్చి సినిమా చూడమన్నాడు. నేను వీల్ చెయిర్లో కూర్చొనే రోల్ చేశానని ఎవరూ అనుకోవద్దు. సినిమాలో కాళ్ళు,చేతలు పడిపోయినా మనసు పరిగెత్తుతూనే ఉంటుంది. ఎంటర్ టైన్మెంట్, లవ్, ఫ్రెండ్ షిప్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. వంశీ అన్నీ చక్కగా చూపించాడు. మనిషికి ఒక తోడు కావాలి. ఆ తోడు ఎంత అవసరమో ఈ సినిమా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ సినిమాలో నాకు కార్తీ తోడుగా నటించాడు. కార్తీ ఫెంటాస్టిక్ యాక్టర్. గుడ్ ఫ్రెండ్. సినిమా గ్యారంటీ హిట్టవుతుంది. ఈ సినిమాతో నాకొక ఫ్రెండ్, తమ్ముడు దొరికాడు. ఈ సినిమాకు మరో ఊపిరి పివిపి. ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. శివ, గీతాంజలి, అన్నమయ్య సినిమాకు వచ్చినంత మంచి పేరు ఈ సినిమాకు వస్తుంది’’ అన్నారు.

కార్తీ మాట్లాడుతూ ‘’వంశీ మన నెటివిటీకి తగిన విధంగా బ్యూటీఫుల్ అడాప్టెషన్ తో ఊపిరి సినిమాను చేశాడు. నాగార్జునగారు ఈ సినిమాలో నటిస్తున్నారనగానే ఈ సినిమాలో నటించడానికి డబుల్ ఓకే చెప్పాను. ఆయనతో నటించడం లైఫ్ లాంగ్ గిఫ్ట్ దొరికినట్టయింది. బెస్ట్ ఇవ్వాలని అందరూ ప్రయత్నించాం. అందరూ ఈ సినిమాను లవ్ చేసి వర్క్ చేశాం. ఎమోషన్స్, సెన్సిబిలిటీ అన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా ఇంత బాగా వచ్చినందకు పివిపిగారు ముఖ్య కారణం. గోపీ సుందర్ గారు బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఎంటైర్ లైఫ్ లో ప్రతి క్షణాన్ని ఎలా సెలబ్రేట్ చేయాలో తెలిసిన వ్యక్తిగా నాగార్జునగారి పెర్ ఫార్మెన్స్ చూసి అందరం ఏడ్చేశాం. రేపు ఆడియెన్స్ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు.

నాగార్జున, కార్తీ, తమన్నా భాటియా, జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Karthi  Oopiri  Audio Launch  Tamannah  Anushka  

Other Articles