Shah Rukh Khan | FAN | Trailer | Jabra Fan Song | Stills

Fan official trailer

Shah Rukh Khan FAN Official Trailer, Jabra FAN Anthem Song, Shah Rukh Khan FAN Teaser, Shah Rukh Khan Fan movie stills, Shah Rukh Khan latest news, Shah Rukh Khan stills, Shah Rukh Khan

FAN Official Trailer: FAN is the story of Gaurav (Shah Rukh Khan) a young man, 20 something, whose world revolves around the mega movie star Aryan Khanna (Shah Rukh Khan) or God as he refers to him. When things don't go according to plan, Gaurav’s love and passion for his God turns in to a dangerous obsession that crosses the fine line. Watch an edge of the seat thriller, FAN which will peel away at both Gaurav and Aryan’s personalities and characters as the two men discover people within themselves that even they didn't know existed.

అంచనాలు పెంచేసిన షారుక్ ఖాన్ ‘ఫ్యాన్’ ట్రైలర్

Posted: 03/01/2016 10:52 AM IST
Fan official trailer

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యాన్’. మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘జబ్రా ఫ్యాన్’ సాంగ్ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో మంచి రికార్డులను క్రియేట్ చేసింది.

అయితే ఎంత షారుక్ సినిమా అయినప్పటికీ.. ఫస్ట్ లుక్ విడుదలయ్యాక అభిమానులు ఆశించిన రేంజులో టీజర్ లేకపోయింది. కానీ ఇపుడు బాలీవుడ్ ’ఫ్యాన్’ సినిమా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఇందులో షారుక్ డబుల్ రోల్ అదిరిపోయింది.

ఇందులో అభిమాని గౌరవ్, హీరో అర్యన్ ఖాన్ పాత్రలో షారుక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఆర్యన్ ఖాన్ అంటే పిచ్చి, చివరకు ఆర్యన్ కు వీరాభిమానిగా మారుతాడు. ఆర్యన్ కు తన అభిమానాన్ని చూపించే ప్రయత్నంలో గౌరవ్ కొన్ని పనులు చేస్తుంటాడు. అవి ఆర్యన్ కు నచ్చకపోగా.. మీలాంటి అభిమానుల కోసం తానెందుకు సమయం కేటాయించాలంటూ ఆర్యన్ ఘాటుగా స్పందిస్తాడు. అసలే కాస్త ఆర్యన్ ఖాన్ వలే వుండే గౌరవ్ కు అభిమానం దెబ్బతింటుంది. దీంతో గౌరవ్ లేకుండా ఆర్యన్ లేడు అనే విధంగా నిరూపించాలని ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ఆర్యన్ ఖాన్ కు గౌరవ్ చుక్కలు చూపిస్తాడు.

ట్రైలర్ చాలా ఆసక్తిగా వుంది. గౌరవ్, ఆర్యన్ ఖాన్ ల మధ్య ఎలాంటి వార్ జరుగబోతుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ చిత్రాన్ని వేసవి సెలవుల్లో ఏప్రిల్ 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో, అభిమానులకు ఎలాంటి ఆనందాన్ని అందిస్తుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Fan  Trailer  Jabra Fan Song  Stills  

Other Articles