justin bieber | Pop Videos | Pop songs | Hot stills

Justin bieber hurts his fans

justin bieber latest stills, justin bieber hot news, justin bieber videos, justin bieber news, justin bieber interviews, justin bieber songs, justin bieber

justin bieber hurts his fans: Hollywood pop singer justin bieber latest comments, updates, hot videos, stills, gallery.

తప్పులు చేసానంటున్న పాప్ సింగర్

Posted: 02/26/2016 10:55 AM IST
Justin bieber hurts his fans

హాలీవుడ్ యువ పాప్ సింగర్ జస్టీన్ బీబర్ గురించి పాప్ సంగీత అభిమానులకు బాగా సుపరిచితుడే. జస్టీన్ బీబర్ కు భారీ సంఖ్యలో ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. తారలను అభిరుచులు, స్టైల్, ఫ్యాషన్, పద్ధతులను అభిమానులు ఫాలో అవుతూ వుంటారు. కానీ జస్టీన్ బీబర్ మాత్రం తనను ఎవరూ ఆదర్శంగా తీసుకోవద్దని అంటున్నాడు.

తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో జస్టీన్ బీబర్ మాట్లాడుతూ... పాప్ సింగర్స్ను ఏ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోరాదని, ముఖ్యంగా తనను ఎవరూ ఆదర్శంగా తీసుకోవద్దని, అది ఏ ఒక్కరికి మంచిది కాదని చెప్పారు. తనకు స్టార్ డమ్ అస్సలు ఇష్టం లేదని చెప్పాడు. తనను మరొకరు అనుసరించడం నచ్చదని అన్నాడు.

జనాలకు నిజంగా ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే.. మీరు నాపై ఎలాంటి నమ్మకం పెట్టుకోకండి. ఎందుకంటే అలా నమ్మకం పెట్టుకోవడం వల్ల ప్రతిసారి మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాను. ఇది కొంత ఆందోళనగా అనిపించినా ఈ విషయం చెప్పక తప్పదు. నాకు ఎలాంటి శక్తి లేదు. నేను ఎవరి సమస్యలను తీర్చగల సమర్థుడిని కాదు. నేను చాలా తప్పులు చేశాను. నా ఉద్దేశం ప్రకారం మనుషులను పూజించడం అనేది మంచి పద్దతి కాదంటూ జస్టీన్ బీబర్ చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : justin bieber  pop videos  songs  stills  

Other Articles