Kalyana Vaibhogame | Release date | Naga Shourya | Malavika Nair

Kalyana vaibhogame film release on 4 march

Kalyana Vaibhogame Release Date, Kalyana Vaibhogame Jukebox, Kalyana Vaibhogame Trailers Kalyana Vaibhogame Movie Posters, Kalyana Vaibhogame Movie news, Kalyana Vaibhogame Movie stills, Kalyana Vaibhogame Movie updates, Kalyana Vaibhogame, Naga shaurya, Malavika Nair, Audio release date

Kalyana Vaibhogame Film Release on 4 March: Kalyana Vaibhogame 2016. featuring Naga Shourya and Malavika Nair exclusively on Madhura Audio. Music composed by Kalyan Koduri. Directed by BV Nandini Reddy and produced by KL Damoodar Reddy.

ఆయన మా ఆస్థాన విద్వాంసుడు: కళ్యాణ వైభోగమే

Posted: 02/24/2016 09:51 AM IST
Kalyana vaibhogame film release on 4 march

నాగ శౌర్య , మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై కె.ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మించారు. కళ్యాణ్ కోడూరి సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా మార్చి 4న విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.... కళ్యాణ్ వైభోగమే చిత్రం మార్చి 4న విడుదలవుతుంది. సాధారణంగా సినిమా కథ విని, అంతా రెడీ అయిన తర్వాతే సినిమా గురించి మాట్లాడుతాను. ఈ సినిమా కోసం 14 నెలలు పాటు వర్క్ చేశాం. కళ్యాణ్ కోడూరి సంగీతం అందించిన ఈ సినిమా పాటలకు, సాహిత్యానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలామొదలైంది తర్వాత నేను, నందిని రెడ్డీ కలిసి చేసిన సినిమా ఇది. మా ఇద్దరిదీ మ్యాజికల్ కాంబినేషన్. ఇద్దరి వేవ్ లెంగ్త్ లు చక్కగా ఉండటంతో మంచి కథ కుదురుతుంది. కళ్యాణ్ కోడూరిగారు మా ఆస్థాన విద్వాంసుడు. ఇంత వరకు మా బ్యానర్ లో వచ్చిన పాటల కంటే ఈ సినిమా ఆల్బమ్ కు మంచి పేరు వస్తుంది. ముఖ్యంగా పెళ్ళి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను సినిమా చేసిన ప్రతిసారి ఎవరో ఒకరు కొత్తవారిని ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. అలాగే ఈ సినిమా విషయానికి వస్తే రాజు అనే సినిమాటోగ్రాఫర్ ను పరిచయం చేశాను. సినిమా చేస్తున్నట్టు ముందుగా చాలా మందికి తెలియదు. కానీ సినిమా అంతా పూర్తై, సెన్సార్ పూర్తయిన తర్వాతే సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. ఇక్కడ అభిషేక్ పిక్చర్స్ వారు సినిమాను విడుదల చేస్తున్నారు. అలాగే ఓవర్ సీస్ లో కూడా చాలా మంచి బిజినెస్ అయ్యింది. ఇది లవ్ స్టోరీ. ఇప్పుడు జనరేషన్ కు తగిన విధంగా ఎంటర్ టైన్మెంట్ వేలో చెప్పాం. ప్రతి ఒక క్యారెక్టర్ చక్కగా కుదిరింది. నేను శాటిలైట్ కోసం ఎప్పుడూ నటీనటులను తీసుకోలేదు. కథను అనుసరించే నా సినిమాలో నటీనటులు ఉంటారు. మా బ్యానర్ లో వచ్చిన ఇతర సినిమాలకు ధీటుగా సినిమా ఉంటుంది’’ అన్నారు.

నటీనటులు :
నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , రాశి , ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , 'మిర్చి' హేమంత్ , స్నిగ్ధ తదితరులు.

సాంకేతిక నిపుణులు :
సంగీతం: కళ్యాణ్ కోడూరి; సినిమాటోగ్రఫీ: జి.వి.ఎస్. రాజు; ఎడిటర్: జునైద్ సిద్దిక్; కొరియోగ్రఫీ: చిన్నిప్రకాష్, రఘు, అని; యాక్షన్: డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు; కాస్ట్యూమ్ డిజైనర్: శ్రీ, వైశాలి; డైలాగ్స్ & లిరిక్స్: లక్ష్మీ భూపాల్; కో - ప్రొడ్యూసర్స్: వివేక్ కూచిభొట్ల, జగన్ మోహన్ రెడ్డి.వి; ప్రొడ్యూసర్: కె.ఎల్. దామోదర్ ప్రసాద్; స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: బి.వి.నందిని రెడ్డి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyana Vaibhogame  Release Date  Naga shaurya  Malavika Nair  Trailers  

Other Articles