Allu Arjun | Sarainodu | Teaser | Release Date | Rakul preet singh

Sarrainodu teaser creates records

Allu Arjun Sarrainodu Teaser Records, Sarainodu Teaser, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Sarrainodu Teaser Creates Records: Stylish star allu arjun Sarainodu movie teaser release on 18 feb. boyapati srinu director, Rakul preet singh heroine. Thaman Music.

‘నాన్నకు ప్రేమతో’ రికార్డ్ బద్దలు కొట్టిన ‘సరైనోడు’

Posted: 02/20/2016 03:37 PM IST
Sarrainodu teaser creates records

‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘సరైనోడు’ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ ప్రస్తుతం యూట్యూబ్ లో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్ ను ఇప్పటికీ 1,106,867 మంది వీక్షించారు. ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

గతంలో ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో టీజర్ 36 గంటల్లో 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి రికార్డ్ క్రియేట్ చేస్తే ఇప్పుడు దానిని బ్రేక్ చేస్తూ కేవలం 34 గంటల్లో ‘సరైనోడు’ 1 మిలియన్ మార్క్ ని దాటి సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీజర్ కే ఇలాంటి రెస్పాన్స్ వస్తుండటంతో.. ట్రైలర్ మరియు సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ రానుందో చూడాలి.

టీజర్ లో ‘ఎర్ర తోలు కదా స్టైలిష్ గా ఉంటాడనుకున్నావేమో.. మాస్.. ఊర మాస్’ అంటూ బన్నీ చెప్పిన డైలాగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో బన్నీ చాలా స్టైలిష్, మాసివ్ లుక్ లో కనిపిస్తున్నాడు. టైటిల్ కు తగ్గట్లుగానే బన్నీ లుక్ వుండటంతో మరింత రెస్పాన్స్ ఎక్కువయ్యింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. ఇందులో బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarainodu  Teaser  Rakul preet singh  

Other Articles