Nagarjuna | Karthi | Oopiri | Teaser | Tamannah | Anushka

Nagarjuna oopiri teaser

Oopiri Teaser Released, Oopiri Movie Release Date Confirmed, Nagarjuna Oopiri movie shooting details, Oopiri movie news, Oopiri movie stills, Oopiri, Nagarjuna in Oopiri, Karthi Oopiri movie news, Oopiri movie posters, Karthi Oopiri first look, Tamannah latest stills, Tamannah hot news, Tamannah

Nagarjuna Oopiri Teaser: Oopiri has Nagarjuna and Karthi playing the lead roles ably supported by Tamannaah and others. Produced by PVP Cinema, Oopiri is directed by Vamsi Paidipally, Music by Gopi Sunder and Camera by P. S. Vinod.

టీజర్ అదుర్స్: అంచనాలు పెంచేసిన ‘ఊపిరి’ టీజర్

Posted: 02/20/2016 07:10 PM IST
Nagarjuna oopiri teaser

కింగ్‌ నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఊపిరి’. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్. వి. పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు.

ఈ టీజర్ చాలా ఇంట్రస్టింగ్ గా వుంది. టీజర్ చూస్తుంటే నాగార్జున ఏదో రేస్ లో గాయపడి, వీల్ చైర్ కు అంకితమయినట్లుగా కనిపిస్తొంది. ఇక ఆవారాగా తిరిగే కార్తీ పద్ధతులు నచ్చి, నాగార్జున తన దగ్గర అసిస్టెంట్ మరియు కేర్ టేకర్ గా నియమించుకున్నట్లుగా కనిపిస్తుంది. నాగార్జున కేర్ టేకర్, పిఎ పాత్రలో తమన్నా నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

టీజర్ మాత్రం అద్భుతంగా వుంది. సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. ఇక తమన్నా, కార్తీల మధ్య వచ్చే రొమాంటిక్, లవ్ ట్రాక్ సీన్లు ఎంటర్ టైనింగ్ గా వుండబోతున్నాయని అర్థమవుతోంది. ఏదేమైనా మల్టీస్టారర్ గా రాబోతున్న ‘ఊపిరి’ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టీజర్ కు గోపిసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మార్చి 25న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Karthi  Oopiri  Teaser  Tamannah  Anushka  

Other Articles