Mega Brothers in one platform

Mega brothers in one platform

Mega Star chiranjeevi, Pawan Kalyan, Mega Family, Sardar, Sardar Audio launch

Mega Brothers Megastar chiranjeevi, Nagababu and Pawan Kalyan will meet on Sardar Audio launch programme

ఒకే వేదిక మీదకు మెగాబ్రదర్స్.. సర్దార్ ఆడియోనే వేదిక

Posted: 02/18/2016 11:16 AM IST
Mega brothers in one platform

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీలేని గుర్తింపు మెగాస్టార్ కుబుంబానికి ఉంది. మెగాస్టార్ చిరంజీవితో తమ్ముడు పవన్ కళ్యాణ్ కు కొన్ని విభేదాలు ఉన్నాయని చాలా చానల్స్ ఆ మధ్యన ప్రచారం చేశాయి. అయితే మెగాబ్రదర్స్ అందరూ కలిసి ఒకే వేదిక మీద కనిపిస్తే చూడాలని ఎంతో మంది మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ కు వెళ్లారు. అక్కడ పవర్ స్టార్ తో పాటు కొంత సమయాన్ని గడిపి, ఫోటోలు కూడా దిగారు.

అయితే తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆడియో వేదికను మెగాబ్రదర్స్ కలయికకు వేదికగా చెయ్యాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మెగాబ్రదర్స్ మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబులు ఒకే వేదిక మీదకు వచ్చేందుకు సిద్దమైనట్లు దాదాపుగా ఖరారైంది. గతంలో గబ్బర్సింగ్ ఆడియో వేడుకలో ఈ ముగ్గురు అన్నదమ్ములు కలిసి కనిపించారు. ఆ సినిమా పవన్ కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచింది. దీంతో సెంటిమెంట్ పరంగా కూడా మెగా బ్రదర్స్ కలయిక కలిసొస్తుందని భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mega Star chiranjeevi  Pawan Kalyan  Mega Family  Sardar  Sardar Audio launch  

Other Articles