Sunils krishnashtami cinema completed sensor

Sunils krishnashtami cinema completed sensor

Sunil, Sunils krishnashtami, krishnashtami sensor

After long time Sunils cinema krishnashtami releasing on Tomarrow. The Sensor completed for this cinema. They gave U/A cirtificate and they appriciates sunils performence in krishnashtami.

కృష్ణాష్టమి సెన్సార్ పూర్తి.. సునీల్ పర్ఫామెన్స్ కేక

Posted: 02/18/2016 11:24 AM IST
Sunils krishnashtami cinema completed sensor

సునీల్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్  ‘కృష్ణాష్టమి’. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని చాలా రోజుల క్రితమే పూర్తి చేసారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే కథలో కొత్తదనం లేకపోయినా ట్రీట్మెంట్ మాత్రం చాలా బాగుంటుందనే టాక్ వినిపిస్తోంది. అమెరికా నుంచి వచ్చిన కుర్రాడు ఇండియాలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కున్నాడో చెప్పే స్ట్రయిట్ సినిమా. ఇందులో ఎలాంటి ట్విస్ట్ లు , టర్నింగ్ లు ఉండవు. అయితే ఈ సినిమాలో కామెడీ మాత్రం పుష్కలంగా ఉంటుందంట. బ్రహ్మీ సెల్ఫీ బర్ఫీగా బాగా నవ్విస్తాడని చెబుతున్నారు అందరూ.

అలాగే , ఎమోషన్ సీన్స్ లో సునీల్ పెర్ఫామెన్స్ చాలా బాగుందనేది టాక్. ఈ చిత్రానికి కోన వెంకట్ కథను అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఖచ్చితంగా సునీల్ కి రీబ్యాక్ మూవీ అవుతుందని దర్శకుడు వాసు వర్మ చాలా ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తోంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో , ఉన్నతమైన సాంకేతిక విలువలతో రూపొందించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించింది. ఈ సినిమాలో సునీల్ సరసన , నిక్కీ గర్లానీ ,  డింపుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమా రేపు విడుదలకు సిద్ధంగా ఉంది.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil  Krishnastami  Movie  

Other Articles