Pawan Kalyan | Sardaar Gabbar Singh | Sudigali Sudheer | Audio Release Date | Teaser

Sudigali sudheer comments on pawan kalyan

Sudigali Sudheer talks about Pawan Kalyan, Sardaar Gabbar Singh Audio Release Date, Sardaar Gabbar Singh Teaser Pawan kalyan Sardaar Gabbar singh Bike, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sudigali Sudheer comments on Pawan Kalyan: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

సుధీర్ కాళ్లకు పవర్ స్టార్ నమస్కారం చేసాడట

Posted: 02/17/2016 11:07 AM IST
Sudigali sudheer comments on pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తన సినిమాలతోనే కాకుండా వ్యక్తిగతంగా తన వ్యక్తిత్వం నచ్చి పవన్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. ఇక సినిమా విషయానికొస్తే... టాలెంట్ వున్న దర్శకులు, రచయితలు, నటీనటులను ప్రోత్సహించడంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ముందే వుంటారు.

అలా తాజాగా పవన్ కంట్లో పడిన వ్యక్తులు ఇద్దరూ ప్రస్తుతం ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో నటిస్తున్నారు. జబర్ధస్త్ కామెడీ షో ద్వారా మంచి పేరును దక్కించుకున్న సుడిగాలి సుధీర్, షకలక శంకర్ లు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గురించి సుధీర్ తన అనుభూతులను చెప్పుకొచ్చాడు.

ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుధీర్ మాట్లాడుతూ... ‘నా స్కిట్ లు చూసి నచ్చి తనను, షకలక శంకర్ ను కావాలని తీసుకున్నానని’ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చాలా సంతోషం అనిపించింది. సెట్స్ లో ఆయన అంత సింపుల్ గా ఉండడం తామూ అస్సలు ఊహించలేదని, మమ్మల్ని పిలిచి డైలాగ్ ఇంకా ఎలా చెప్తావ్… ఇంకా బాగా ట్రై చెయ్ అని చెప్తుంటే… ఎక్కడో ఊహల్లో ఉన్నట్లుందని సుధీర్ చెప్పుకొచ్చాడు.

HMTV

అలాగే పవన్ కళ్యాణ్ ను ఆరాధించే ఒక అభిమానిగా ఆయనతో నటించడం నిజంగా గొప్ప అనుభూతిని మిగిల్చింది. తనను పేరు పెట్టి ‘సుధీర్’ అని పిలవడం ఎప్పటికీ మరిచిపోలేనని, పొరపాటున నా కాలు పవన్ సార్ కాలుకు తగిలితే తిరిగి నా కాళ్ళకు నమస్కారం పెట్టిన ఆయన సంస్కారానికి ఫిదా అయిపోయానని సుధీర్ ఎంతో ఉద్వేగభరితంగా చెప్పుకొచ్చారు.

మరి ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో వీరిద్దరి పాత్రలు ఎలా వుండనున్నాయో త్వరలోనే తెలియనుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మార్చి 12న గ్రాండ్ గా, హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నట్లుగా తెలిసింది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రాయ్ లక్ష్మీ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Sardaar Gabbar singh  Sudigali Sudheer  Audio Release Date  posters  

Other Articles