Nimrat Kaur | sister | marriage | Stills | movies

Nimrat kaur younger sister marriage

Nimrat Kaur sister marriage, Nimrat Kaur sister wedding, Nimrat Kaur sister marriage details, Nimrat Kaur happy with sister, Nimrat Kaur rubina marriage, Nimrat Kaur in marriage

Nimrat Kaur younger sister marriage: bollywood actress Nimrat Kaur younger sister Rubina`s marriage. Nimrat Kaur dream come true.

తన చెల్లికి పెళ్లి చేసిన ఎయిర్ లిఫ్ట్ హీరోయిన్

Posted: 02/15/2016 05:22 PM IST
Nimrat kaur younger sister marriage

సినిమా హీరోయిన్ల జీవితాలు చాలా లగ్జరీగా సాగుతాయని, ఒక్క సినిమా హిట్టయ్యితే చాలు ఇక రెమ్యునరేషన్ బాగా పెంచేస్తారని, ఫ్యామిలీతో ఆనందంగా గడిపేస్తారని వార్తలొస్తూ వుంటాయి. కానీ అందరు హీరోయిన్లు ఒకేలా వుండరు కదా! అందులో బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ కూడా ఒకరు.

బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ కూడా సామాన్య మానవ జీవితాన్నే అనుభవిస్తుంది. 2002లో కాశ్మీర్ లో జరిగిన ఓ ఎన్కౌంటర్ ఆర్మీలో పని చేస్తున్న తన తండ్రి మరణించాడు. అప్పటి నుంచి పెద్ద కూతురైన నిమ్రత్ తన కుటుంబ బాధ్యతల్ని మోస్తూ వస్తోంది. తన కుటుంబ భారాన్ని మోయడానికి హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగెట్టింది.

మొదట మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరును దక్కించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటిగా సక్సెస్ ను సొంతం చేసుకుంది. తాజాగా అక్షయ్ కుమార్ సరసన ‘ఎయిర్ లిఫ్ట్’ చిత్రంలో నటించింది. అయితే ఇలా హీరోయిన్ గా తనకు వచ్చిన డబ్బుతో కొద్దిరోజుల క్రితం తన చెల్లలు పెళ్లిని ఢిల్లీలో ఘనంగా జరిపించింది.

ఇంటికి పెద్ద కూతురుగా ముందు పెళ్లి చేసుకోకుండా తన చెల్లెలికి పెళ్లి చేసి, కుటుంబ భాద్యతను మోస్తుంది. 33 ఏళ్లు నిండిన నిమ్రత్ పెళ్లి చేసుకొని, తన పనేదే తాను చూసుకోకుండా తన కుటుంబ భాద్యతలను మర్చిపోకుండా చెల్లి పెళ్లి చేయడంతో అందరూ నిమ్రత్ ను అభినందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nimrat Kaur  Younger sister  Rubina  marriage  stills  

Other Articles