Krishnagaadi Veera Premagaadha | Success Tour Schedule | Nani | Mehr Pirzada

Krishnagaadi veera premagaadha movie success tour schedule

Krishnagaadi Veera Premagaadha thanks meet, Krishnagaadi Veera Premagaadha collections, Krishnagaadi Veera Premagaadha talk, Krishnagaadi Veera Premagaadha tickets, Krishnagaadi Veera Premagaadha stills, Krishnagaadi Veera Premagaadha songs, Krishnagaadi Veera Premagaadha movie, Krishnagaadi Veera Premagaadha, Nani, Mehr Pirzada stills

Krishnagaadi Veera Premagaadha Movie Success Tour Schedule: Nani latest block buster hit Krishnagaadi Veera Premagaadha. This film team attend in thanks meet.

కృష్ణగాడి వీరప్రేమగాథ విజయయాత్ర

Posted: 02/16/2016 09:24 AM IST
Krishnagaadi veera premagaadha movie success tour schedule

నాచురల్ స్టార్ నాని హీరోగా అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ 14 రీల్స్ బ్యారన్ పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనీల్ సుంకరలు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంటుంది.

కృష్ణగాడి వీర ప్రేమగాథ అన్నిసెంటర్లలో ఘనవిజయం సాధించిన సందర్భంగా చిత్రయూనిట్ అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేయటానికి వస్తున్నారు. మొహరీన్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాను తొలి రోజు నుంచే సక్సెస్ టాక్ సొంతం చేసుకోవటంతో పాటు నాని కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించి రికార్డ్ సృష్టించింది. తెలుగు రాష్ట్రా లతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ వసూళ్లు సాధిస్తున్న సందర్భంగా ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు చిత్రయూనిట్ స్వయంగా కృతజ్ఞతలు తెలియజేయనున్నారు.

ఇందులో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 19 వరకు తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లలోని వివిథ నగరాల్లో కృష్ణగాడి వీర ప్రేమగాథ యూనిట్ విజయ యాత్రను నిర్వహించనున్నారు.

టూర్ షెడ్యూల్ :
ఫిబ్రవరి 15 : నైజాం - భ్రమరాంబ థియేటర్, శ్రీ రాములు థియేటర్ - ఫస్ట్ షో; శాంతి థియేటర్, మొగా ధియేటర్ - సెకండ్ షో.
ఫిబ్రవరి 16: వైజాగ్ - శరత్ ధియేటర్ - మార్నింగ్ షో; కాకినాడ - ఆనంద్ కాంపెక్స్- ఫస్ట్ షో; రాజమండ్రి - కుమారి థియేటర్ - సెకండ్ షో.
ఫిబ్రవరి 17 : ఏలూరు - సాయి బాలాజీ థియేటర్ - మార్నింగ్ షో; విజయవాడ - కపర్ది ధియేటర్ - మ్యాట్నీ షో; గుంటూరు - టాలీవుడ్ థియేటర్ - ఫస్ట్ షో; ఒంగోళ్ -సత్యం థియేటర్ - సెకండ్ షో.
ఫిబ్రవరి 18: నెల్లూరు- కాంపెక్స్- మార్నింగ్ షో; తిరుపతి - బిగ్ సి థియేటర్ - మ్యాట్నీ షో; కడప - మురళి థియేటర్ - ఫస్ట్ షో.
ఫిబ్రవరి 19: అనంతపూర్ - గౌరి ధియేటర్ - మార్నింగ్ షో; కర్నూల్ - రాజ్ థియేటర్ - మ్యాట్నీ షో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishnagaadi Veera Premagaadha  thanks meet  Nani  Mehr Pirzada  stills  

Other Articles