YVS Chowdary | Bommarillu | Theaters | Seized

Yvs chowdary bommarillu theaters seized

YVS Chowdary Bommarillu Theaters Seized, YVS Chowdary Theaters Seized, YVS Chowdary lossed theaters, YVS Chowdary latest news, YVS Chowdary latest updates, YVS Chowdary news, YVS Chowdary

YVS Chowdary Bommarillu Theaters Seized: Director and Producer YVS Chowdary bommarillu theaters are seized in gudivada.

‘రేయ్’ నిర్మాత ‘బొమ్మరిల్లు’ థియేటర్ సీజ్

Posted: 02/04/2016 05:14 PM IST
Yvs chowdary bommarillu theaters seized

దర్శకుడు వైవియస్ చౌదరికి చెందిన థియేటర్లను ఆంధ్రాబ్యాంకు అధికారులు సీజ్ చేసారు. గతకొద్ది కాలంగా వైవియస్ తీస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో చేసిన అప్పులు కూడా తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. వైవియస్ చౌదరి స్వీయ దర్శకనిర్మాణంలో సాయిధరమ్ తేజను హీరోగా పరిచయం చేస్తూ ‘రేయ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఈ సినిమా విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో లాభాల మాట ఏమోగానీ.. వైవియస్ చౌదరిని పూర్తిగా నష్టాల్లోకి ముంచేసింది. అయితే ఈ సినిమా నిర్మాణం కోసం వైవియస్ చౌదరి గుడివాడలో వున్న తన రెండు థియేటర్లతో పాటు చేపల చెరువులను తనఖా పెట్టి ఆంధ్రాబ్యాంక్ లో 10 కోట్లను తీసుకున్నాడని తెలిసింది.

అయితే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో పెట్టిన డబ్బులు రాకపోగా.. తీవ్ర నష్టాల్లోకి ముంచేసింది. దీంతో ఈ డబ్బులు కట్టలేని పరిస్థితి వల్ల వడ్డీకి వడ్డీ పెరిగి 10 కోట్లు కాస్తా.. 14కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారులు వైవియస్ చౌదరికి నోటీసులు జారీ చేసి, తనఖాకు పెట్టిన వాటిని సీజ్ చేసుకున్నట్లుగా టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి ఏం జరుగనుందో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YVS Chowdary  Bommarillu  Theaters  Seized  gudivada  

Other Articles