Venkatesh | Saala Khadoos | remake | Irudhi Suttru | Babu Bangaram

Venkatesh confirmed in saala khadoos remake

Venkatesh in Saala Khadoos telugu remake, Venkatesh in Saala Khadoos remake, Venkatesh in Irudhi Suttru remake, Venkatesh movie news, Venkatesh remake movies, Venkatesh latest stills, Venkatesh hot news, Venkatesh stills

Venkatesh confirmed in Saala Khadoos remake: Saala Khadoos and Irudhi Suttru produced by Rajkumar Hirani and YNot Studios is going to be remade in Telugu. Actor Venkatesh was extremely moved by the film and will be reprising Madhavan’s role in the Telugu version. This perhaps is a first that a top actor has come on board to remake a film even before it’s release! The telugu version will be directed by Sudha Kongara who directed the original versions as well.

కన్ఫర్మ్: ‘ఇరుధి సుట్రు’ రీమేక్ లో వెంకటేష్

Posted: 01/29/2016 10:49 AM IST
Venkatesh confirmed in saala khadoos remake

మాధవన్, రితిక సింగ్ ప్రధాన పాత్రలలో రూపొందిన తాజా చిత్రం ‘సాలా ఖడూస్’. (తమిళంలో ‘ఇరుధి సుట్రు’). రాజ్ కుమార్ హిరాణీ, వైనాట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం వహించారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో మాధవన్ బాక్సింగ్ ట్రైనర్ పాత్రలో అద్భుతంగా నటించాడు. రితికకు మాధవన్ బాక్సింగ్ ట్రైనర్ గా కనిపించాడు.

‘సాలా ఖడూస్’ నేడు (జనవరి 29) తమిళం, హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయబోతున్నారు. మాధవన్ పాత్రలో విక్టరీ వెంకటేష్ నటించనున్నాడు. ఒరిజినల్ వర్షెన్ కు దర్శకత్వం వహించిన సుధ కొంగర.. తెలుగు రీమేక్ కు కూడా దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు తెలియజేయనున్నారు.

ప్రస్తుతం వెంకటేష్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందనున్న ‘బాబు బంగారం’ ప్రాజెక్టు మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Venkatesh  Saala Khadoos  remake  stills  

Other Articles