karnataka Govt recommendation behind SS Rajamouli Padma Sri

Karnataka govt recommendation behind ss rajamouli padma sri

SS rajamouli, Padma Sri, SS rajamouli, Baahubai, Padmasri to Rajamouli, rajamouli

SS Rajamouli tweet his feeling on Padmasri.He told that karnataka Govt recommend his name to central govt.

రాజమౌళికి పద్మశ్రీ వెనుక కర్ణాటక ప్రభుత్వం

Posted: 01/26/2016 02:38 PM IST
Karnataka govt recommendation behind ss rajamouli padma sri

తెలుగు సినిమా సత్తాను చాటిన రాజమౌళిని పద్మశ్రీ వరించింది. అయితే పద్మశ్రీ కోసం తెలుగు రాష్ట్రలు రెకమెండ్ చెయ్యలేదు. మరి తెలుగు సినిమా ప్రతిష్టను పెంచిన దర్శక ధీరుడికి పద్మశ్రీ ఇవ్వాలని ప్రతిపాదించింది ఎవరో తెలుసా..? కర్ణాటక ప్రభుత్వం. అవును కర్ణాటక ప్రభుత్వం రాజమౌళికి పద్మ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించిందట. రాజమౌళి దీని మీద స్పందిస్తూ.. తాజాగా ట్వీట్ చేశారు. నిజానికి రాజమౌళి తాను పుట్టింది.. కర్ణాటకలో కాగా ఆంధ్రప్రదేశ్ లో చదువుకున్నానని, తమిళనాడులో పనిచేశానని, తెలంగాణలో సెటిల్ అయ్యానని.. కాగా అన్ని రాష్ట్రాలకు కొడుకుగా గుర్తింపుతెచ్చుకున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉంది అని ట్వీట్ చేశారు.

అయితే తనకు పద్మశ్రీ అవార్డు రావడం మీద తన ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం తన పేరును రెకమెండ్ చెయ్యడం ఆశ్యర్యాన్ని కలిగించిదని ట్విట్టర్ లో సోస్ట్ చేశాడు. అంతకు ముందు ఏపి రాష్ట్ర ప్రభుత్వం తన పేరును ప్రతిపాదించగా దానికి తాను ఒప్పుకోలేదని కానీ ఏపి మాత్రం తన పేరును ప్రతిపాదించిందని అన్నారు.

పద్మశ్రీ అవార్డు తనకు దక్కడంపై రాజమౌళి ఈ విధంగా ట్వీట్ చేసారు. ‘‘నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మిక్స్డ్ ఫీలింగ్ లో ఉన్నాను. నిజానికి ఈ పద్మశ్రీ అవార్డు అందుకోవడానికి నేను అర్హుడిని అని అనుకోవడం లేదు. ఏదో వినయం కోసం ఈ మాటలు చెప్పడంలేదు. ఇప్పటిదాకా నేను ఏం చేసాను, ఏం సాధించాను అనేది నాకు తెలుసు. ఈ అవార్డు అందుకునేలా కళారంగంలో నా గొప్పతనాన్ని ఏమి చూపలేదు. రామోజీరావు మరియు రజినీకాంత్ లకి పద్మ విభూషణ్ లు రావడం చాలా పర్ఫెక్ట్. ఇలాంటి లెజెండ్స్ తో కలిసి ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని’’ రాజమౌళి ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles