Today is Mass Maharaja Ravi Tejas Birth Day

Today is mass maharaja ravi tejas birth day

RaviTeja, Mass Maharaja Raviteja, Ravi Teja Birth Day

Mass maharaja named star Hero Ravi Teja birth day today. He completed 47 years and entered into 48th year.

నేడు మాస్ మహారాజ బర్త్ డే

Posted: 01/26/2016 01:36 PM IST
Today is mass maharaja ravi tejas birth day

మాస్ మహారాజగా ప్రేక్షకుల మదిలో చెరిగిపోని స్థానాన్ని సొంతం చేసుకున్న రవితేజ పుట్టిన రోజు నేడు. డైరెక్టర్ కావాలనుకున్న రవితేజ తిరుగులేని స్టార్ గా ఎదిగాడు. 1990లో 'కర్తవ్యం' సినిమాలోని ఓ చిన్నపాత్రతో నటుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రవితేజ హీరోగా మారడానికి పది సంవత్సరాలు పట్టింది. 1999లో 'నీకోసం' సినిమాతో హీరోగా మారినప్పటికీ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'ఇడియట్‌' ఆయన కెరీర్‌కు బ్రేక్‌నిచ్చింది. హీరోయిజానికి కొత్త అర్థం చెప్పిన ఈ చిత్రంతో రవితేజ కెరీర్‌ 'ఇడియట్‌'కు ముందు, 'ఇడియట్‌'కి తర్వాత అనే విధంగా మారిపోయింది.

25ఏళ్ళ సినీ కెరీర్‌లో 60 సినిమాల్లో నటించారు. 'సిందూరం', 'ఇట్లు శ్రావణి సుబ్రమ్మణ్యం', 'ఇడియట్‌', 'భద్ర', 'వెంకీ' 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి', 'విక్రమార్కుడు', 'డాన్‌ శీను', 'బలుపు', 'కిక్‌', 'పవర్‌', 'బెంగాల్‌ టైగర్‌' వంటి విభిన్న కమర్షియల్‌, మాస్‌ చిత్రాల్లో నటించారు. మాస్‌ హీరోగా రాణిస్తూనే 'షాక్‌', 'ఖడ్గం', 'నేనింతే', 'నా ఆటో గ్రాఫ్‌', 'శంభో శివ శంభో' వంటి ప్రయోగాత్మక చిత్రాలతోనూ అలరించారు. ఆయా సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కథానాయకుడిగా రవితేజకు మంచి పేరునే తీసుకువచ్చాయి. 'ఖడ్గం', 'నేనింతే' చిత్రాలకు ఉత్తమ నటుడిగా నంది అవార్డులనందుకున్నారు.

సినిమా ఎలా ఉన్నా ఆయనలో ఎనర్జీ, దూకుడు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండటమే రవితేజకు ఇండిస్టీలో ప్రత్యేకతను తీసుకొచ్చింది. సవాలక్ష చికాకులనుంచి బయటపడడానికి వినోదం కోసం థియేటర్‌కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి కావల్సినంత వినోదం పంచడమనే తన లక్ష్యమని రవితేజ ఎప్పుడూ చెబుతుంటారు. 'ఎంటర్‌టైనింగ్‌గా ఉండే చిత్రాల్లో నటించడానికే నా ప్రాధాన్యం. చేసే ప్రతి సినిమా విజయం సాధించాలనే అనుకుంటారు. ఏ సినిమా ఎవరికి, ఎందుకు నచ్చు తుందో, నచ్చలేదో చెప్పడం కష్టం. చిత్తశుద్ధిగా మనం పని చేసుకుపోవడంలోనే అసలైన ఆనందముంద'ని పలు సందర్భాల్లో చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RaviTeja  Mass Maharaja Raviteja  Ravi Teja Birth Day  

Other Articles