Rajinikanths kabali cinema maybe in May month

Rajinikanths kabali cinema maybe in may month

rajinikanth, kabali, kalaipuli thanu, china star winston chao, kollywood, dhansika, radhika apte

Rajinikanths kabali cinema maybe in May month. Rajinikath doing kabali shooting at present. The Kabali shoot almost complated and producer plans to release in may.

కబాలి కనువిందు అప్పుడే అంటున్న నిర్మాత

Posted: 01/24/2016 03:42 PM IST
Rajinikanths kabali cinema maybe in may month

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘క‌బాలి’. యువ దర్శకుడు రంజిత్ ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాని ప‌లు బ్లాక్‌బ‌స్టర్ చిత్రాల‌ను తెరకెక్కించిన క‌లైపులి య‌స్‌.థాను అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతోంది. మలేషియాలో జ‌న‌వ‌రి 20 నుంచి ఫిబ్రవరి 28 వ‌ర‌కు ఈ షెడ్యూల్ ఉంటుంది. ర‌జ‌నీతోపాటు కీల‌క పాత్రధారులంద‌రూ ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి నిర్మాత థాను మాట్లాడుతూ.. ‘‘నేను ఎంతోమంది పెద్ద హీరోల‌తో ప‌నిచేశాను కానీ.. ర‌జ‌నీకాంత్‌తో సినిమా చేయ‌డ‌మ‌నేది నా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను. ఈ చిత్రంలో ర‌జ‌నీకి విలన్‌గా చైనా సూప‌ర్‌స్టార్ విన్స్‌టన్ చౌ న‌టిస్తున్నారు. ఇప్పుడు మ‌లేషియాలో చేస్తున్న షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మేలో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. తెలుగు, త‌మిళ భాష‌ల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాం’ అని చెప్పారు.

ఇక ఇందులో రజనీ సరసన రాధికా ఆప్టే, థ‌న్సిక‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లకు చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది. సాల్ట్ పెప్పర్ లుక్కుతో రాజ‌సంగా ర‌జ‌నీకాంత్‌ కూర్చున్న ఫ‌స్ట్ లుక్‌ స్టిల్‌కు స‌ర్వత్రా పాజిటివ్ స్పంద‌న వెల్లడైంది. ఈ సినిమాలో విలన్‌గా చైనా స్టార్ నటించడంతో.. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajinikanth  kabali  kalaipuli thanu  china star winston chao  kollywood  dhansika  radhika apte  

Other Articles