Ntr | Janatha Garage | Mohanlal | Samantha | Nithya Menon

Ntr janatha garage shooting details

NTR Janatha Garage latest updates, Fahad fazil in NTR Janatha Garage, Mohanlal with NTR in Janatha Garage, Ntr movie news, Ntr movie updates, Ntr Parineeti chopra movie news, Ntr koratala siva movie news, Ntr Janatha Garage movie news, Ntr stills, Ntr

NTR Janatha Garage shooting details: Young tiger ntr upcoming film under Koratala siva direction. Mytri movie makers produce this film. Janatha Garage Working title. Samantha, Nithya menon heroines.

ఫిబ్రవరిలో జనతా గ్యారేజ్ ప్రారంభం

Posted: 01/22/2016 03:39 PM IST
Ntr janatha garage shooting details

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలై, మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇదే జోష్ తో మరో హిట్టు కొట్టేందుకు ఎన్టీఆర్ సిద్ధమవుతున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి ‘జనతా గ్యారేజ్’ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేసారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా జోడి కట్టనున్నారు. మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ మరియు ఫహద్ లు కీలక పాత్రలలో నటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి రెండవ వారంలో ప్రారంభం కానుంది.

మొదటి షెడ్యూల్లోనే మోహన్ లాల్ పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం సారధి స్టూడియోలో ఓ పెద్ద సెట్ ని వేస్తున్నారు. ఈ సెట్ కోసం సూమారు 2.5కోట్లు ఖర్చు చేస్తున్నట్లుగా తెలిసింది. రెండవ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ వంటి వరుస హిట్ చిత్రాలను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ‘జనతా గ్యారేజ్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అదికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntr  Janatha Garage  Mohanlal  Koratala shiva  Movie News  stills  

Other Articles