Allu Arjun | Sarainodu | Pre Look Poster | First look date | stills

Allu arjun sarainodu movie pre look poster

Allu Arjun Sarainodu Pre Look Poster, Sarainodu Pre Look Poster, Allu Arjun Sarainodu first look release date, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Allu Arjun Sarainodu Movie Pre Look Poster: Stylish star allu arjun Sarainodu movie pre look poster released. boyapati srinu director, Rakul preet singh heroine. Thaman Music.

ప్రీ లుక్ పోస్టర్: బండెల్ తో బాక్సులు బద్దలుకొట్టనున్న ‘సరైనోడు’

Posted: 01/22/2016 12:43 PM IST
Allu arjun sarainodu movie pre look poster

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హవా మొదలయ్యింది. ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ కొత్త సినిమాకు సంబంధించిన స్టిల్స్ ఇప్పటివరకు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ప్రస్తుతం బన్నీ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సరైనోడు’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మొన్నటివరకు వర్కింగ్ టైటిల్ గా అనుకున్న ‘సరైనోడు’నే ఖరారు చేసారు.

తాజాగా ఈ చిత్ర ప్రీ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ‘సరైనోడు’ టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ పోస్టర్లను జనవరి26న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. అల్లు అర్జున్ ఈ పోస్టర్ ను తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ కోసం ‘లోఫర్’ హీరోయిన్ దిశా పటానీ చేయనుందని తెలిసింది. కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Sarainodu  Pre Look Poster  first look  Rakul preet singh  

Other Articles