Vikram as a transgender villain

Vikram as a transgender villain

Vikram to play transgender role, Vikram in transgender role, Vikram in villain role, Vikram latest news, Vikram movie news, Vikram movie updates, Vikram stills, Nayanthara, nithya menon, stills

Vikram as a transgender villain: Tamil hero Vikram next film with director anand. nayanthara, nithya menon heroines. vikram to play transgender villan role.

హిజ్రా విలన్ గా కనిపించబోతున్న విక్రమ్

Posted: 01/09/2016 05:21 PM IST
Vikram as a transgender villain

తమిళ హీరో విక్రమ్ ఎక్కువగా ప్రయోగ చిత్రాలను చేస్తుంటాడనే విషయం తెలిసిందే. ‘శివపుత్రుడు’, ‘అపరిచితుడు’, ‘మల్లన్న’, ‘ఐ’.. ఇలా చాలా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి, నటుడిగా మంచి స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాంటి విక్రమ్ మరోసారి అదే ప్రయోగం చేయబోతున్నాడు.

‘ఐ’ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్లీ అలాంటి ప్రయోగాలజోలికి వెళ్లడని అందరూ భావించారు. అందరూ ఊహించినట్లుగా ‘ఐ’ తర్వాత విక్రమ్ ‘10ఎంద్రుకుల్ల’ అనే కమర్షియల్ సినిమా చేసాడు. కానీ ఈ సినిమా ఘోర పరాజయం పాలయ్యింది. దీంతో మళ్లీ ప్రయోగాల బాట పట్టాడు విక్రమ్.

విక్రమ్ హీరోగా ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో హీరో, విలన్ రెండు పాత్రల్లో విక్రమ్ కనిపించనున్నాడు. హీరో పాత్రలో చాలా స్టైలిష్ గా కనిపించబోతుండగా, విలన్ గా మాత్రం హిజ్రా పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం మలేషియాలో జరుగనుంది. ఇందులో నయనతార, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించనున్నారు. మరి ఈ సినిమా విక్రమ్ కు ఎలాంటి విజయాన్ని అందించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram  transgender role  Nayanthara  Nithya Menon  stills  

Other Articles