Mega Fans ready to Guinness record

Mega fans ready to guinness record

Mega Fans wants to break Guinness record, Ram Charan birthday plannings, Ram Charan birthday special news, Ram Charan Guinness book record, Mega Fans Guinness book record, Mega Fans breaks Guinness book record

Mega Fans ready to Guinness record: On 27th March mega power star Ram Charan celebrates his birthday .On the occasion of mega power star birthday ,his fans are donating 1,11,000 units of Blood India wide which will be break existing Guinness book record.

గిన్నిస్ రికార్డు కోసం మెగాఫ్యాన్స్ ఆరాటం

Posted: 01/07/2016 03:17 PM IST
Mega fans ready to guinness record

మెగాపవర్ స్టార్ రాంచరణ్ కు పుట్టినరోజు కానుకగా ఓ రికార్డు క్రియేట్ చేయడానికి మెగా అభిమానులు సిద్ధమయ్యారు. చరణ్ పుట్టినరోజు మార్చి27న.. కానీ మెగా అభిమానులు మాత్రం ఇప్పటికే ఆ సందడికి సన్నాహాలు మొదలుపెట్టేసారు. చరణ్ పుట్టినరోజు సంధర్భంగా ఆయనకు బహుమతిగా ఆరోజున దేశవ్యాప్తంగా వున్న మెగా అభిమానులు 1,11,000 యూనిట్ల రక్తదానం చేయనున్నారు. అయితే ఇంత ఖచ్చితమైన సంఖ్య నమోదు చేయడానికి ఓ కారణం కూడా వుంది.

ఇప్పటి వరకూ గిన్నిస్ బుక్ లో 1,10,000 యూనిట్ల రక్తదానం చేసిన రికార్డు వుంది. ఆ రికార్డును బ్రేక్ చేసి, కొత్త రికార్డును క్రియేట్ చేసి మెగాపవర్ స్టార్ రాంచరణ్ కు కానుకగా ఇవ్వాలని మెగా అభిమానులు నిర్ణయించుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని ముఖ్య నగరాల్లో, పట్టణాల్లో బ్లడ్ క్యాంపు లు పెట్టి దీన్ని నిర్వహిస్తారు . ఈ కార్యక్రమాన్ని అల్ ఇండియా చిరంజీవి యువత అధ్వర్యంలో నిర్వహించనున్నారు. దీనికి ఆయ రాష్ర గవర్నర్ లు ముఖ్య అతిధి గా విచ్చేసి క్యాంపు లను ప్రారంబిస్తారని అల్ ఇండియా చిరంజీవి యువత ప్రెసిడెంట్ స్వామి నాయుడు గారు చెబుతూ మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

ఈ సమావేశంలోని ముఖ్యాంశాలు:
1) ఇది అల్ ఇండియా చిరంజీవి యువత యొక్క కార్పొరేట్ లెవెల్ సమావేశం
2) రామ్ చరణ్ పుట్టిన రోజున 1,11,000 యూనిట్ ల రక్తాన్ని సేకరించి గిన్నిస్ రికార్డు నెలకొల్పుతామని సభ్యులందరూ ప్రతిజ్ఞ చేసారు.
3) ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ల కోసం www.megablooddonors.com అనే వెబ్ సైట్ ఆవిష్కరణ
4) లక్ష్యాన్ని సాదించటానికి జిల్లాల వారిగా కార్యాచరణ ,ఆయా జిల్లాల వారిగా బాద్యతలు అప్పగింత.

ఈ విషయంపై స్వామి నాయుడు మాట్లాడుతూ... ‘మా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజున మా అభిమానులందరం కలిసి ఇచ్చే బహుమతి ఇది. దీనికి మా కమిటిలో 80 మంది సభ్యులం ఈ లక్ష్యాన్ని చేదిస్తామని ప్రతిజ్ఞ చేసాము. దీనికి సంబందించి రక్త దానం చేయాల్సిన అభిమానుల వివరాలు రిజిస్టర్ చేయటానికి ఈ రోజు www.megablooddonors.com ని అవిష్కరిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ప్రాంతాల వారిగా ఉన్న అభిమానులకు చేరవేయటానికి మా అదికారిక ప్రతినిది ch.ధర్మేంద్ర గారు ముఖ్య పాత్ర పోషించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, మన అభిమాన హీరోకి జీవితంలో గుర్తుండిపోయే బహుమతి ఇవ్వాలని కోరుతున్నాము’ అని చెప్పుకొచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆంద్ర ప్రదేశ్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి, అదికారిక ప్రతినిధులు ధర్మేంద్ర, నాగేంద్ర, తమిళనాడు అద్యక్షుడు నగేష్ ,తెలంగాణా అద్యక్షుడు ప్రభాకర్ గౌడ్ పాల్గొన్నారు .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Birthday  Blood donations  Guinness book record  stills  

Other Articles