Megastar Chiranjeevi talks about his First Night

Megastar chiranjeevi talks about his first night

Megastar talks about his First Night, Chiranjeevi talks about his First Night, Chiranjeevi First Night details, Chiranjeevi speech, Chiranjeevi latest news, Chiranjeevi hot news, Chiranjeevi stills, Chiranjeevi

Megastar Chiranjeevi talks about his First Night: Megastar Chiranjeevi attend Allu Ramalingaiah Award function. K. Raghavendra rao got this award 2015 year.

రైలులో మెగాస్టార్ శోభనం విశేషాలు

Posted: 01/07/2016 12:48 PM IST
Megastar chiranjeevi talks about his first night

ప్రతి ఏటా ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య పేరుతో ఇచ్చే జాతీయ పురస్కారాన్ని 2015 సంవత్సరానికి గాను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుకు నిన్న ప్రధానం చేసారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, చిరంజీవి, అల్లు అర్జున్ లతో పాటు చిరంజీవి భార్య సురేఖ మరియు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ తన ఫస్ట్ నైట్ క్షణాలను చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఈ కార్యక్రమంలో చిరంజీవి తన ఫస్ట్ నైట్ గురించి చెప్పడమేంటనీ అనుకుంటున్నారా. అసలు విషయమేమిటో చిరంజీవి మాటల్లో... నా ఫస్ట్ నైట్ ను రాఘవేంద్రరావు చాలా సరదాగా ట్రైన్ లో ఏర్పాటు చేసారు. తన సినిమాల్లో పూలు, పండ్లు పెట్టి ఎలా శోభనం గదిని డెకరేట్ చేస్తారో.. అదే విధంగా ట్రైన్ లో నా ఫస్ట్ నైట్ ను ఏర్పాటు చేసారు. పెళ్లైన కొత్తలో ఒకసారి సినిమా షూటింగ్ నిమిత్తం నేను, సురేఖ రైలులో మద్రాసుకు వెళ్తున్నాం. మేము రైలులో వెళ్తున్నా సంగతి తెలుసుకున్న రాఘవేంద్రరావు గారు మాకోసం రైలు బోగీలో పూలు, పళ్లు, స్వీట్లతో.. అచ్చం ఆయన సినిమాలోని ఫస్ట్‌నైట్ సీన్‌ను తలపించే విధంగా డెకరేట్ చేయించారు. ఇదంతా కేవలం ఆయన ఒక్క ఫోన్ కాల్‌తో చేయించారు. ఇలాంటి ఫస్ట్‌నైట్ నేను నిజంగా ఎప్పుడూ చేసుకోలేదు. ఆ రైలు ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటూ చిరంజీవి తన మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chiranjeevi  First Night  Allu Ramalingaiah  Award  K. Raghavendra Rao  Stills  

Other Articles