NTR Nannaku Prematho Promotions in MEK

Ntr nannaku prematho promotions in mek

NTR in Meelo Evaru Koteeswarudu, Nannaku Prematho Movie Talk Adurs, Nannaku Prematho Audio Jukebox, Nannaku Prematho Movie News, Nannaku Prematho Movie Posters, Nannaku Prematho Movie stills, Nannaku Prematho Movie Release Date, Nannaku Prematho Audio, Ntr, Rakul Preet Singh

NTR Nannaku Prematho Promotions in MEK: Young tiger ntr Nannaku Prematho Movie Release on 13 January. Sukumar direction, Devi Sri Prasad Music, Rakul Preet singh heroine.

‘నాన్నకు ప్రేమతో’ మీలో ఎవరు కోటీశ్వరుడు

Posted: 01/07/2016 10:48 AM IST
Ntr nannaku prematho promotions in mek

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సంక్రాంతి కానుకగా ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ‘నాన్నకు ప్రేమతో’ ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్రారంభించేసారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రమోషన్స్ కోసం తన సమయాన్ని కేటాయించినట్లుగా తెలుస్తోంది.

‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ‘మీలో ఎవరు కోటిశ్వరుడు’ సీజన్ 3లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్ నిన్న పూర్తయ్యింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ చాలా జోష్ గా పాల్గొనడమే కాకుండా, ఈ సినిమా తాను పాడిన ‘ఫాలో ఫాలో..’ పాటను ఈ కార్యక్రమంలో పాడినట్లుగా తెలిసింది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిచిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి యంగ్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఎన్టీఆర్ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో ఎన్టీఆర్ పాడిన ‘ఫాలో ఫాలో..’ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : NTR  Meelo Evaru Koteeswarudu  Nannaku Prematho  Release Date  Rakul Preet Singh  Stills  

Other Articles