తన హావభావాలతో, అద్భుతమైన డాన్స్ లతో మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సునీల్ ఇప్పుడు 'కృష్ణాష్టమి' అనే సరికొత్త ఫామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధ పడుతున్నాడు. వాసు వర్మ దర్శకత్వంలో, ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆడియోను ఈ నెల 9న రాజమండ్రిలోని GIET కాలేజీలో చాలా గ్రాండ్ గా చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. నిక్కి గల్రాని మరియు డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. " మా బ్యానర్ లో వస్తోన్న మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న నమ్మకం ఉంది. రాజమండ్రిలో 9న ఆడియోని రిలీజ్ చేసి, చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారం లో రిలీజ్ చేస్తాము", అని దిల్ రాజు అన్నారు.
దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ... " ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫ్యామిలీ వాల్యూస్ ఈ చిత్రంలో ఉంటాయి. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియాలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనేది మెయిన్ పాయింట్".
సునీల్, నిక్కి గల్రాని, డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్న ఈ చిత్రం విడుదల తేది మరియు ఇతర వివరాలను త్వరలోనే తెలుపుతాం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.
దర్శకత్వం - స్క్రీన్ ప్లే: వాసు వర్మ. నిర్మాత - రాజు . సహ నిర్మాతలు - శిరీష్ , లక్ష్మణ్ . ఫోటోగ్రఫీ - చోటా కె. నాయుడు . ఎడిటర్ - గౌతం రాజు . సంగీతం - దినేష్ . కథ - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం . ఫైట్ మాస్టర్ - అనల్ అరసు. ఆర్ట్ డైరెక్టర్ - ఎస్. రవీందర్. నిర్మాణం - శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more