నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం మరికొద్ది రోజుల్లో తీరనుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘డిక్టేటర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ‘డిక్టేటర్’ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బాలయ్య చురుకుగా పాల్గొంటున్నారు. ఈ చిత్ర విడుదలకే కాకుండా సెన్సార్ కు కూడా ఓ ముహూర్తాన్ని ఖరారు చేసారు. ఈ చిత్రాన్ని ఈరోజు ఉదయం 9:36 నిమిషాలకు సెన్సార్ కు పంపించనున్నారు. సెన్సార్ టాక్ మరికొద్ది గంటల్లో వెలువడనుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ వస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో వున్నారు.
శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందించిన పాటలు, ట్రైలర్స్ ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి.
బాలకృష్ణ కెరీర్లో అత్యధిక థియేటర్స్‌లో సినిమా విడుదల చేస్తున్నారు. అన్నీ ఏరియాల బిజినెస్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైపోయాయి. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.
ఈ చిత్రానికి ఫైట్స్: రవివర్మ, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, రచన: శ్రీధర్ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్,గోపిమోహన్, నిర్మాత: ఈరోస్ ఇంరట్నేషనల్, కో ప్రొడ్యూసర్, దర్శకత్వం: శ్రీవాస్.
(And get your daily news straight to your inbox)
Mar 04 | పర్సంటేజ్ తక్కువొచ్చిందని ఎవరైనా చదువు మానేస్తారా? మన జాతి రత్నం శ్రీకాంత్ అలియాస్ నవీన్ పొలిశెట్టి మాత్రం బీటెక్‌లో 40 శాతమే వచ్చిందిని ఎమ్‌టెక్ చేయకుండా ఉండిపోయాడట. అది నిజంగా కాదులెండి జాతిరత్నాలు సినిమాలో.... Read more
Mar 04 | రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభాషా చిత్రం ‘అరణ్య’.. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గోంకర్, సామ్రాట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ప్రేమఖైదీ’, ‘గజరాజు’, ‘రైలు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను... Read more
Mar 04 | ఎంత దూరమైనా డ్రైవింగ్ చేసేందుకు రెడీ కానీ, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాలంటే మాత్రం మావల్ల కాదంటుంటారు చాలామంది వాహనదారులు. ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ పడుతుందా? ఎప్పుడు సర్రుమంటూ స్పీడుతో ముందుకు దూసుకెళ్దామా? అని... Read more
Mar 04 | టాలీవుడ్ హీరోలు ఒకరి సినిమాల్లోని పాటలను మరొకరు రిలీజ్ చేస్తూ సుహృద్భావ వాతావరణం కొనసాగిస్తున్నారు. తాజాగా, నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటించిన రంగ్ దే చిత్రంలో మూడో పాటను సూపర్ స్టార్ మహేశ్... Read more
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more