Raghavender Rao Gets Allu Ramalingaiah Puraskaram

Raghavender rao gets allu ramalingaiah puraskaram

Raghavendra Rao Gets Allu Puraskaram, Raghavendra Rao Allu Puraskaram, Allu Puraskaram for Raghavendra Rao, Raghavendra Rao latest news, Raghavendra Rao movies, Raghavendra Rao, Allu Puraskaram

Raghavender Rao Gets Allu Ramalingaiah Puraskaram: Megastar Chiranjeevi will be presenting Allu award to K Raghavendra Rao while Mega Power Star Ram Charan and Stylish Star Allu Arjun.

దర్శకేంద్రుడికి అల్లు పురస్కారం.. చిరు, చరణ్, బన్నీల రాక

Posted: 01/05/2016 04:51 PM IST
Raghavender rao gets allu ramalingaiah puraskaram

ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలను అందుకుని, టాలీవుడ్ లో దర్శకేంద్రుడిగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న దర్శకుడు కె.రాఘవేంద్ర రావు. అలాంటి ఈ దర్శకేంద్రుడికి మరో అరుదైన గౌరవం దక్కింది.

ప్రతీ ఏటా ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య పేరుతో పురస్కారాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది అల్లు రామలింగయ్య పురస్కారాన్ని కె.రాఘవేంద్ర రావు అందుకోనున్నారు. చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలను అందించిన వారిలో కె.రాఘవేంద్ర రావును ఈ పురస్కారానికి అర్హులుగా ఈ ఏడాదికి ఎంపిక చేసారు.

ఈ ఏడాది అల్లు రామలింగయ్య పురస్కారాన్ని కె.రాఘవేంద్ర రావుకు రేపు సాయంత్రం హైదరాబాద్ లోని ‘సత్యసాయి నిగమాగమం’లో మెగాస్టార్ చేతుల మీదుగా అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లు అతిథులుగా విచ్చేయనున్నారు. వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghavendra Rao  Allu Puraskaram  Chiranjeevi  latest news  stills  

Other Articles