Kriti sanon angry on her co passenger

Kriti sanon angry on her co passenger

Kriti sanon insulted by co passenger, Kriti sanon insulted, Kriti sanon insults, Kriti sanon watching pirated, Kriti sanon dilwale, Kriti sanon latest stills, Kriti sanon tweets, Kriti sanon hot news, Kriti sanon hot stills

Kriti sanon angry on her co passenger: Actress Kriti Sanon latest bollywood movie Dilwale. Kriti Sanon loses her calm and shared her reaction when she found someone watching Pirated version of Dilwale in flight.

హీరోయిన్ కే సిన్మా చూపెట్టేసాడు!

Posted: 12/29/2015 01:07 PM IST
Kriti sanon angry on her co passenger

ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా పైరసీ అనేది పెద్ద సమస్య అనే విషయం తెలిసిందే. సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీ కావడం, మార్కెట్లో లభించడంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారు. దీనివల్ల సినీ నిర్మాతలు చాలా వరకు నష్టపోతున్నారు. ఇలాంటి పైరసీలను అరికట్టేందుకు పోలీసులు చాలా చర్యలే తీసుకుంటున్నారు.

ఇదిలా వుంటే బాలీవుడ్ భామ కృతిసనన్ కు ఓ ఘోర అవమానం జరిగింది. తాను నటించిన సినిమాను ఎవరో ఓ వ్యక్తి పైరసీ చేసి, చూస్తుంటే ఏమి చేయలేని పరిస్థితిలో చూస్తూ వుండిపోయింది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతీ సనన్ ప్రధాన పాత్రలలో నటించిన ‘దిల్ వాలే’ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. పాజిటివ్ టాక్ తో నడుస్తున్న ఈ సినిమా పైరసీ ప్రస్తుతం మార్కెట్లో హల్చల్ చేస్తోంది.

ఇందులో కృతిసనన్ హీరోయిన్ గా నటించింది. ఇటీవలే కృతి ఢిల్లీ వెళ్లారు. ఈ ఫ్లైట్ లో తన తోటి ప్రయాణికుడు ఈ సినిమా పైరసీ కాపీని మొబైల్లో చూస్తుండగా గమనించి... ‘ఇలా పైరసీ లో చూడటం కంటే థియేటర్లో చూస్తే మీరు మరింత ఎంజాయ్ చేస్తారు’ అంటూ చాలా రిక్వెస్ట్ చేసిందట. అయినా కృతి మాటలు ఆ వ్యక్తి పట్టించుకోకుండా ఆ సినిమా మొత్తం మొబైల్ లోనే చూసేసాడట. ఈ తతంగాన్ని ఫోటో తీసి, తన సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది కృతి.

నా కళ్లెదుటే పైరసీ కాపీ చూశాడు. నేను తట్టుకోలేకపోయా. ఎంతోమంది కష్టంతో ఓ సినిమా రూపొందుతోంది. పైరసీ కాపీ చూసి, మా కష్టాన్ని వృథా చేయకండి. దయచేసి థియేటర్లకు వెళ్లి, సినిమా చూడండి అని కృతి బ్రతిమిలాండినిప్పటికీ ఫలితం లేకపోయింది. మొత్తానికి ఈ అమ్మడిని మాటలను కూడా పట్టించుకోకుండా ఆ ప్రయాణికుడు అవమానించేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kriti sanon  Dilwale  Tweets  Pirate movie  Co passenger  stills  

Other Articles