NTR | Puneeth Rajkumar | Sings

Ntr singing for puneet raj kumar 25th film

NTR sings for Puneeth Rajkumar 25th film, NTR sings for Puneeth, NTR sings for Puneeth film, NTR sings kannada song, NTR kannad song, NTR Puneeth Rajkumar 25th film, NTR latest tweets, NTR songs, NTR nannaku prematho, Puneeth Rajkumar

NTR Singing For Puneet Raj kumar 25th film: Young tiger NTR sings kannada song for Kannada powerstar Puneeth Rajkumar 25th film Chakravyooha. Thaman Music.

పవర్ స్టార్ కోసం పాట పాడేసిన యంగ్ టైగర్

Posted: 12/24/2015 11:49 AM IST
Ntr singing for puneet raj kumar 25th film

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ పాట పాడబోతున్నట్లుగా గతకొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే తాజాగా ఈ పాటను ఎన్టీఆర్ పాడారు. ఇక ఈ సినిమా విశేషాలెంటంటే...

పునీత్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘చక్రవ్యూహ’. ఈ సినిమా పునీత్ కు 25వ చిత్రం, అలాగే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం కూడా ఎన్టీఆర్ కు 25వ సినిమా. ఇద్దరూ కూడా స్టార్ హీరోలే. పునీత్ కోసం ఎన్టీఆర్ పాడారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ‘చక్రవ్యూహ’ సినిమాలోని ఓ పాటను ఎన్టీఆర్ తాజాగా పాడారు.

NTR sings for Puneeth Rajkumar 25th film-02

ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎన్టీఆర్ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసాడు. థమన్, పునీత్ లతో కలిసి ఎన్టీఆర్ సెల్ఫీ దిగాడు. ఈ పాటను త్వరలోనే యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు. మరి ఇప్పటివరకు తెలుగులో తన సినిమాల్లో పాటలు పాడిన ఎన్టీఆర్... మరి కన్నడంలో పునీత్ కోసం పాడిన ఈ పాట ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 27న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సంక్రాంతి కానుకగా ‘నాన్నకు ప్రేమతో’ విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Puneeth Rajkumar  Sings  Chakravyuha  Tweets  Stills  

Other Articles