Mumaith Khan Item song in Dictator

Mumaith khan item song in dictator

Mumaith Khan Item song in Balakrishna Dictator, Mumaith Khan in Dictator, Mumaith Khan hot stills, Mumaith Khan item songs, Mumaith Khan hot videos, Balakrishna Dictator Movie Release Date, Balakrishna Dictator Movie news, Balakrishna movies, Balakrishna stills, Anjali, Sonal chauhan

Mumaith Khan Item song in Dictator: Nandamuri balakrishna latest film Dictator. Anjali, sonal chauhan heroines. Srivas direction. Thaman music. Balakrishna Dictator Movie Release on Pongal 2016.

ముమైత్ ఖాన్ తో బాలయ్య ఐటం సాంగ్?

Posted: 12/22/2015 04:36 PM IST
Mumaith khan item song in dictator

‘పోకిరి’ సినిమాలోని ‘ఇప్పటికింకా నా వయసు..’ అంటూ కుర్రకారు గుండెల్లో నిలిచిపోయిన ముమైత్ ఖాన్ కు గతకొద్ది కాలంగా తెలుగు సినీ ఆఫర్లు రావడం లేదు. ప్రైవేట్ ఆల్బంలను రూపొందించడంలో ముమైత్ ఖాన్ బిజీగా వుంది. అయితే ‘పోకిరి’ తర్వాత పలు హాట్ హాట్ ఐటెం సాంగ్స్ తో పాటు హీరోయిన్ గా, ప్రధాన లీడ్ క్యారెక్టర్ వున్న సినిమాల్లో కూడా నటించింది. అలాంటి ముమైత్ కు తాజాగా మరోసారి ఓ మాస్ మసాలా సాంగ్ లో నటించే అవకాశం వచ్చినట్లుగా తెలిసింది.

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డిక్టేటర్’. థమన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. అయితే ఇందులోని ఓ మాస్ మసాలా పాట కోసం ఇప్పటికే చాలా మంది హీరోయిన్లను అనుకున్నారు. కానీ చివరగా ఈ పాట కోసం ముమైత్ ఖాన్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది.

‘డిక్టేటర్’ చిత్ర దర్శకనిర్మాతలు ఇటీవలే ముమైత్ కు ఆఫర్ ఇవ్వడం, తను కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాంగ్ షూటింగ్ కు సిద్ధమవుతున్నారు. రేపటి (డిసెంబర్ 23) నుంచి హైదరాబాద్ లో వేసిన ఓ స్పెషల్ సెట్లో ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తికానుంది.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో బాలయ్య సరసన అంజలి, సొనాల్ చౌహాన్, అక్షలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ కలిసి కథ-స్క్రీన్ ప్లేని అందించారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumaith Khan  Item song  Dictator  Balakrishna  Anjali  sonal chauhan  

Other Articles