Sneha talks about Beep Song Issue

Sneha talks about beep song issue

Sneha responds on Beep Song Issue, Sneha talks about Beep Song Issue, Sneha comments on Beep Song, Sneha comments, Sneha beep song comments, Sneha latest interview, Sneha latest update, Sneha movies, Sneha latest stills, Sneha stills, Sneha hot news

Sneha talks about Beep Song Issue: Kollywood actress Sneha responds on simbu`s latest Beep Song Issue. Sneha talks about this Beep song issue.

అంతా మీరే చేసారంటున్న స్నేహ

Posted: 12/22/2015 12:31 PM IST
Sneha talks about beep song issue

తమిళనాడులో ప్రస్తుతం రచ్చ రచ్చ చేస్తున్న ‘బీప్ సాంగ్’ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి గల కారణం మనమే అని అంటున్నారు నటి స్నేహ. శింబు, అనిరుధ్ సంయుక్తంగా రూపొందించిన ఈ బీప్ సాంగ్ పై ప్రస్తుతం తమిళ ప్రజలు, మహిళా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వీరిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. శింబు, అనిరుధ్ లను అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధమయ్యారు.

అయితే ఇంత రాద్ధాంతం జరుగుతున్న ఈ బీప్ సాంగ్ విషయంపై స్నేహ తనదైన శైలిలో స్పందించారు. ఒక పాట ప్రాచుర్యం పొందడానికి మనమే కారణం. గతంలో స్త్రీలను గౌరవిస్తూ చాలా పాటలొచ్చాయి. అదే విధంగా మహిళలను కించపరుస్తూ కూడా పాటలొచ్చాయి. కానీ వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఒక పాట గురించి పదే పదే చర్చించి, తెలియని వారికి కూడా తెలిసేలా చేసి, మరింత ప్రాచుర్యం అయ్యేలా చేస్తున్నామంటూ స్నేహ చెప్పుకొచ్చారు.

ఈ బీప్ సాంగ్ గురించి తనను చాలా మంది అడిగారని, కానీ తాను ఇప్పటికీ ఆ పాటను వినలేదని స్నేహ చెప్పారు. ఇప్పుడు ఆ పాట వినాలనే ఆసక్తి తనకు కూడా కలుగుతోందని, కానీ ఆ పాటలో అసభ్యపదజాలాలు ఉపయోగించారని తెలిసి, అసలు దాని గురించి చర్చించకుండా వుండటమే మంచిదని అనిపిస్తున్నట్లుగా స్నేహ తెలిపారు. ఒక సామాన్య మహిళగా చెప్పాలంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా పాటలు వింటున్నారు. కాబట్టి పాటల్లో అసభ్య పదాలు లేకుండా వుంటే బాగుంటుంది అని స్నేహ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sneha  Beep Song  stills  Responds  hot news  

Other Articles