Varun Tej Upcoming movies details

Varun tej upcoming movies details

Varun Tej Upcoming movies list, Varun Tej Upcoming movies, Varun Tej movies list, Varun Tej next movies, Varun Tej movie details, Varun Tej updates, Varun Tej stills, Varun Tej Loafer, Loafer

Varun Tej Upcoming movies details: Mega hero Varun Tej latest film Loafer. This film will be release on 17 December. Puri Jagannadh direction, Disha patani heroine.

నలుగురిని లైన్లో పెట్టిన ‘లోఫర్’

Posted: 12/16/2015 04:35 PM IST
Varun tej upcoming movies details

‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ... ఆ తర్వాత ‘కంచె’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ప్రస్తుతం వరుణ్ హీరోగా టాలీవుడ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్’ చిత్రం చేసాడు. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే ఈ సినిమా విడుదల కాకముందే మరో నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు వరుణ్. ‘లోఫర్’ తర్వాత ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అలాగే వరుణ్ కు ‘కంచె’ వంటి విభిన్నమైన చిత్రాన్ని అందించిన దర్శకుడు క్రిష్ దర్శకత్వంలోనే ‘రాయబారి’ అనే పేరుతో ఓ సినిమా చేయనున్నాడు.

ఇవే కాకుండా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్లో వరుణ్ హీరోగా ‘ఫీల్ మై లవ్’ అనే పేరుతో ఓ సినిమా రూపొందనుంది. అలాగే ‘ప్రస్థానం’ దర్శకుడు దేవకట్టా దర్శకత్వంలో వరుణ్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఇలా హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుణ్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. మరి ఇందులో ఏయే సినిమాలు హిట్టవుతాయో, వరుణ్ కు ఎలాంటి ఇమేజ్ ను తెచ్చిపెడతాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Loafer  Upcoming movies  stills  news  

Other Articles