Rajini Murugan saved Keerthi Suresh Grandmother

Rajini murugan saved keerthi suresh grandmother

Rajini Murugan film saved Keerthi Suresh family, Rajini Murugan saved Keerthi Suresh grandmother, Keerthi Suresh grandmother news, Keerthi Suresh latest news, Keerthi Suresh hot stills, Keerthi Suresh movie news, Keerthi Suresh movie updates, Keerthi Suresh

Rajini Murugan saved Keerthi Suresh Grandmother: Kollywood actress Keerthi Suresh latest film Rajini Murugan. This film saved Keerthi Suresh family members.

హీరోయిన్ బామ్మను కాపాడిన ‘రజనీ మురుగన్’

Posted: 12/12/2015 10:56 AM IST
Rajini murugan saved keerthi suresh grandmother

చెన్నలో వరద బాధితుల్లో మాములు ప్రజలే కాకుండా సినీతారలు, పలువురు ప్రముఖులు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇందులో కోలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ఫ్యామిలీ కూడా ఒకరు. ఈమె ప్రముఖ సీనియర్ నటి మేనక వారసురాలు. తన బామ్మ బ్రతకడానికి గల కారణం తాను నటించిన కొత్త చిత్రమేనని చెబుతోంది కీర్తి.

తమిళంలో కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం ‘రజనీ మురుగన్’. శివకార్తీకేయన్, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ చిత్రం ఈనెల 4వ తేదిన విడుదల కావాల్సి వుంది. కానీ తన బామ్మకు గత నెల 30వ తేదిన నగరంలోని ఓ హాస్పిటల్లో శస్త్ర చికిత్స చేయడానికి వైద్యులు నిర్ణయించారు. అయితే తన బామ్మ మాత్రం తాను నటించిన ‘రజనీ మురుగన్’ చిత్రం చూసిన తర్వాతనే ఆపరేషన్ చేయించుకుంటానని చెప్పింది. దీంతో వైద్యులను రిక్వెస్ట్ చేసి, ఆపరేషన్ ను ఒకరోజు వాయిదా వేయాలని కోరాము అని తెలిపింది కీర్తి.

బామ్మ కోరిక మేరకు నవంబర్ 30న ‘రజనీమురుగన్’ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన ద్వారా చూసాము. ఆ సినిమా చూసి తన ఫ్యామిలీ, మరియు బామ్మ తన నటనను ప్రశంసించారని చెప్పింది. అయితే అదే రోజున భారీగా వర్షం పడటంతో హాస్పిటల్లోని జనరేటర్ లో వాటర్ బాగా చేరడంతో బామ్మకు ఆపరేషన్ జరగలేదు. దీంతో అక్కడ తినడానికి కూడా ఏమి దొరకకపోవడంతో బయట షాపులో బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ కొనుక్కుని ఇంటికి వెళ్లిపోయామని తెలిపింది.

ఆ తర్వాత పేపర్ లో చూస్తే మియాట్ హాస్పిటల్లో 18 మంది మరణించారని తెలిసి అందరం షాక్ అయ్యాం. ఒకవిధంగా చెప్పాలంటే మా బ్రతికిందంటే దానికి వర్షం, మరియు నా సినిమాయే కారణమని చెబుతోంది కీర్తి సురేష్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Keerthi Suresh  Grandmother  Rajini Murugan  Hot stills  

Other Articles