Ravi Teja Bengal Tiger Satellite Rights

Ravi teja bengal tiger satellite rights

Bengal Tiger Ssatellite Rights, Bengal Tiger Movie Release Date, Bengal Tiger Audio Songs, Bengal Tiger movie trailer, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Ravi Teja Bengal Tiger Satellite Rights: Raviteja latest film Bengal Tiger. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie Release on 10 December.

అమ్ముడుపోయిన బెంగాల్ టైగర్ శాటిలైట్ రైట్స్

Posted: 12/09/2015 04:07 PM IST
Ravi teja bengal tiger satellite rights

రవితేజ, తమన్నా, రాశిఖన్నా హీరోహీరోయిన్లుగా ‘రచ్చ’ ఫేం దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. ఈ చిత్రం రేపు (డిసెంబర్ 10) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని U/A  సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది.

కమర్షియల్ లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, అక్ష తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. భీమ్స్ సంగీతం అందించిన పాటలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ఈ ఆల్బంలోని అన్ని పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. ట్రైలర్లు, వీడియో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి. సినిమా విడుదలకు ముందే భారీ మొత్తానికి శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోవడంతో చిత్ర యూనిట్ సంతోషంగా వున్నారు. ‘బెంగాల్ టైగర్’ శాటిలైట్ రైట్స్ కోసం చాలా పోటీ ఏర్పడింది. ఇందులో ప్రముఖ జెమిని టీవీ ఛానెల్ ‘బెంగాల్ టైగర్’ శాటిలైట్ రైట్స్ ని 7.5 కోట్లకు కొనుగోలు చేసారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.రాధామోహ‌న్ నిర్మించారు. భారీ అంచనాలతో విడుదల కానున్న ఈ చిత్రంతో మరోసారి రవితేజ కలెక్షన్ల మోత మోగించడం ఖాయమని సినీవర్గాల అంచనా. మరి ‘బెంగాల్ టైగర్’ ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  Satellite Rights  Release Date  Rashi khanna  Tamanna  

Other Articles