Nannaku Prematho Movie Release on Pongal 2016

Nannaku prematho movie release on pongal 2016

Nannaku Prematho Release on Pongal 2016, Nannaku Prematho Movie Latest Poster, Nannaku Prematho Movie Teaser, NTR Nannaku Prematho Movie Poster, NTR Nannaku Prematho Movie, NTR Sukumar Movie First Look Still, NTR First Look Still, Ntr latest film shooting updates, Ntr latest news, Ntr movie news, Ntr movie updates, Ntr shooting details, Ntr latest stills, Ntr news, Rakul movies, Rakul

Nannaku Prematho Movie Release on Pongal 2016: Young tiger Ntr next film Nannaku Prematho. Sukumar direction. Rakul preet singh heroine. Devi Sri prasad music. BVSN Prasad Producer.

మరో స్టైలిష్ పోస్టర్ ‘నాన్నకు ప్రేమతో’.. సంక్రాంతికే విడుదల!

Posted: 12/09/2015 04:17 PM IST
Nannaku prematho movie release on pongal 2016

‘టెంపర్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హీరోగా యూత్ ఫుల్ ఫిల్మ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. స్పెయిన్ లో షూటింగ్ పూర్తయితే, టోటల్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్, పోస్టర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అంచనాలు భారీగా పెంచేసాయి. అయితే తాజాగా మరో పోస్టర్ ను విడుదల చేసారు.

ఎన్టీఆర్ ఈ సినిమాలో చాలా స్టైలిష్ లుక్స్ తో అలరించనున్నాడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Nannaku Prematho  Release Date  Teaser  Rakul preet singh  Sukumar  Movie News  

Other Articles