Akhil | Dance Perform | IIFA Utsavam 2015

Akhil dance performance at iifa utsavam

Akhil Akkineni to Dance Perform at IIFA 2015 Utsavam, Akhil Dance Perform at IIFA, Akhil Perform at IIFA Utsavam, Akhil Akkineni at IIFA 2015 Utsavam, Akhil latest news, Akhil latest updates, Akhil stills

Akhil Dance Perform at IIFA Utsavam: Akkineni akhil going to perform at IIFA. IIFA Utsavam 2015 will be started on 5, 6 December.

లైవ్ పర్ఫార్మెన్స్ కు సిద్ధమవుతున్న అఖిల్

Posted: 12/03/2015 03:34 PM IST
Akhil dance performance at iifa utsavam

ఈసారి ఐఫా IIFA(ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ) అవార్డుల వేడుకల్లో టాలీవుడ్ తారల జోరు పెరుగనుంది. ఇప్పటికే తెలుగు అవార్డుల వేడుకకు అల్లు శిరీష్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. అలాగే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి అగ్ర, స్టార్ హీరోలు, హీరోయిన్లు, సాంకేతికనిపుణులు, అతిరథ మహారథులు పాల్గొననున్నారు.

ఈ కార్యక్రమంలో అక్కినేని సిన్నోడు అఖిల్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవడానికి సిద్ధమవుతున్నాడు. ఈ వేడుకలో అఖిల్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో అలరించబోతున్నాడు. ఇప్పటికే షో కోసం అఖిల్ డాన్స్ రిహర్సల్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. తన తండ్రి నాగార్జున, అన్నయ్య నాగచైతన్యల సినిమాల్లోని పాటలతో పాటు తాను హీరోగా నటించిన ‘అఖిల్’ సినిమాలోని పాటలను మెడ్లీగా ప్రజెంట్ చేయనున్నాడని సమాచారం.

ఈ IIFA వేడుకలు డిసెంబర్ 5, 6వ తేదిలలో హైద్రాబాద్ గ్రౌండ్ గా నిర్వహించనున్నారు. IIFAలో సౌత్ ఇండస్ట్రీలోని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలకు నామినేట్ అయిన వారి జాబితాను ఇప్పటికే విడుదల చేసారు. మరి వారిలో విజేతలు ఎవరనే విషయం త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhil  Dance Perform  IIFA Utsavam 2015  stills  

Other Articles