Srinivas Avasarala | Nani | Mohana krishna

Nani srinivas avasarala movie started

Ashta Chemma Combination is Back, Nani Ashta Chemma Combination is Back, Nani Srinivas Avasarala movie started, Nani movies, Nani latest news, Srinivas Avasarala movies, Srinivas Avasarala movie news, Srinivas Avasarala stills

Nani Srinivas Avasarala movie started: Ashta Chamma is a 2008 Telugu, comedy film written and directed by Mohana krishna. The film combination is going to be repeated again now.

7ఏళ్ల తర్వాత మళ్లీ కాంబినేషన్ రిపీట్స్

Posted: 12/03/2015 12:13 PM IST
Nani srinivas avasarala movie started

నాని, అవసరాల శ్రీనివాస్ కలిసి ‘అష్టా చెమ్మా’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే దర్శకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణకు కూడా ఈ సినిమా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత నాని, అవసరాల శ్రీనివాస్ లు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. హీరోగా నాని, దర్శకుడిగా శ్రీనివాస్ లు బిజీ అయ్యారు. అయితే దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ ముగ్గురి కాంబినేషన్లో తాజాగా ఓ చిత్రం రూపొందుతోంది.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, అవసరాల శ్రీనివాస్ లు ప్రధాన పాత్రలలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈరోజు ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమయ్యింది. లవ్, థ్రిల్లింగ్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలను ప్రకటించనున్నారు.

ఇక నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జ్యో అచ్యుతానంద’ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinivas Avasarala  Nani  Mohana krishna  stills  

Other Articles