Deepika Padukone | Mahesh Babu | Tweets | Hot stills

Deepika padukone tweets about mahesh babu

Mahesh Babu Pairup with Deepika Padukone, Mahesh Babu with Deepika Padukone, Mahesh Babu likes Deepika Padukone, Deepika Padukone tweets about mahesh, Deepika Padukone talks about mahesh, Deepika Padukone latest tweets, Deepika Padukone mahesh babu movies, Deepika Padukone hot stills, Deepika Padukone stills

Deepika Padukone Tweets about Mahesh Babu: Tollywood Prince Mahesh Babu likes bollywood star heroine Deepika Padukone acting, dance, everything.

త్వరగా ఈ కాంబినేషన్ సెట్ చెయ్యండయ్యా!

Posted: 12/01/2015 05:26 PM IST
Deepika padukone tweets about mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో కూడా మహేష్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. మహేష్ తో సినిమా చేయాలని చాలా మంది స్టార్ హీరోయిన్లు ఎదురుచూస్తున్నారు. అలాంటి మహేష్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే అంటే ఇష్టమట. ఈ అమ్మడి యాక్టింగ్ కు మహేష్ ఫిదా అయిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా మహేష్ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

అలాగే దీపికా పదుకునే ఇప్పటికే పలు సంధర్భాల్లో తనకు మహేష్ అంటే ఇష్టమని, తనతో ఓ సినిమా చేయాలనుందంటూ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అటు దీపికా, ఇటు మహేష్ లు ఒకరినొకరు కలిసి నటించడానికి ఇష్టపడుతుండటంతో పలువురు టాలీవుడ్ దర్శకనిర్మాతలు వీరి కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తీయాలనే ఆలోచనలో వున్నట్లుగా తెలుస్తోంది.

‘బ్రహ్మోత్సవం’ తర్వాత మహేష్ తో సినిమా చేయడానికి ఏఆర్ మురుగదాస్, పూరీ జగన్నాథ్, త్రివిక్రమ్, క్రిష్... ఇలా చాలా మంది దర్శకులు రెడీగా వున్నారు. కానీ ప్రస్తుతం వున్న సినీవర్గాల అంచనా ప్రకారం... ‘బ్రహ్మోత్సవం’ తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో, ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ నటించనున్నాడని సమాచారం.

మహేష్-దీపికాలు ఒకే స్ర్కీన్ పై కలిసి నటిస్తే చూడాలిని మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ ఇద్దరి దర్శకులలో మహేష్-దీపికాల కాంబినేషన్ తో ఎవరు సినిమా తీస్తారో త్వరలోనే తెలియనుంది. ఈ కాంబినేషన్ ఒకవేళ వర్కౌట్ అయితే మహేష్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. మరి ఈ కాంబినేషన్ ఎవరి ద్వారా సెట్స్ పైకి వెళుతుందో భవిష్యత్తులోనే చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  Mahesh Babu  Tweets  Hot stills  News  

Other Articles