Nagachaitanya | Premam Remake | Film Launch | Shruti Haasan | Anupama Parameswaran

Nagachaitanya premam remake film launched

Nagachaitanya Chandu Mondeti Film Launched, Nagachaitanya Premam Remake, Nagachaitanya romance with Shruti Haasan, Nagachaitanya romance with anupama parameswaran, Nagachaitanya Premam, Nagachaitanya, Premam Remake, Shruti Haasan, Anupama Parameswaran

Nagachaitanya Premam Remake Film Launched: Akkineni Nagachaitanya romance with shruti haasan and anupama parameswaran in malayalam hit film Premam remake.

డిసెంబర్ 3నుంచి ముగ్గురు భామలతో చైతూ రొమాన్స్

Posted: 11/28/2015 05:45 PM IST
Nagachaitanya premam remake film launched

అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో 'సితార ఎంటర్ టైన్ మెంట్స్ ' ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రారంభం. అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్ లా కాంబినేషన్ లో 'కార్తికేయ' వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు 'చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న తొలి చిత్రం ఈరోజు ఉదయం గం:10.30 నిమిషాలకు హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోస్ లో వైభవంగా ప్రారంభమైంది.

అక్కినేని నాగచైతన్య, కధానాయికలలో ఒకరైన ‘అనుపమ పరమేశ్వరన్’ ల పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి హీరో అఖిల్ అక్కినేని క్లాప్ నివ్వగా, కెమరా స్విచ్ ఆన్ ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు చేశారు. ప్రముఖ నిర్మాతలు డి.సురేష్ బాబు, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)’ దిల్ రాజు, జెమిని కిరణ్ , నల్లమలుపు బుజ్జి, దర్శకుడు మారుతి లతో పాటు పలువురు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్స్ విచ్చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు.

ఈ సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ..'అక్కినేని నాగచైతన్య, శ్రుతిహాసన్, చందు మొండేటి ల కాంబినేషన్ లో మలయాళం' లో ఘన విజయం సాధించిన 'ప్ర్తేమం' చిత్రాన్ని తెలుగు లో పునర్నిర్మించటం ఆనందంగా ఉంది. 'సితార ఎంటర్ టైన్ మెంట్స్' పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిది ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ విశాఖలో డిసెంబర్ ౩న ప్రారంభమవుతుంది. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయనున్నామని తెలిపారు. తెలుగు నేటివిటీ కి తగినట్లుగా కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో చందు మొండేటి చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదు'' అన్నారు

దర్శకుడు 'చందు మొండేటి' మాట్లాడుతూ..'అక్కినేని నాగచైతన్య హీరోగా, సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించటం ఎంతో ఆనందంగా ఉంది. 'ప్రేమం' చిత్రాన్ని తెలుగులో రూపొందించటం అన్నది భాద్యత తో కూడినది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మా టీం ఈ చిత్రం రూపకల్పన కు కృషి చేస్తోంది అని తెలిపారు దర్శకుడు.

చిత్రంలోని ఇతర తారాగణం జీవా, బ్రహ్మాజీ, నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్ తదితరులు. ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, ; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని: ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఫైట్స్ : అనల్ అర్స్: ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్; నిర్మాత: సూర్యదేవర నాగవంశీ; స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagachaitanya  Premam Remake  Film Launch  Shruti Haasan  Anupama Parameswaran  stills  

Other Articles

  • Hit sneak peek provides chills and thrill in equal doses

    విశ్వక్ సేన్ ‘‘హిట్’’ స్నీక్‌పీక్‌.. చూశారా?

    Feb 25 | ఫలక్ నుమా దాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్‌సేన్‌ నాయుడు తాజాగా హిట్ చిత్రం ద్వారా వస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్.. కీలక పాత్రలో నటిస్తున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న... Read more

  • Nani s v secret behind the killer drama s title revealed

    ‘వి’ లో నానీ నెగిటివ్ రోల్ సీక్రెట్.. ట్విస్టు ఉందట

    Feb 24 | న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపోందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఇటు నానీకి .. అటు సుధీర్ బాబుకి... Read more

  • Crucial action sequences of naarappa will be an added advantage

    నారప్పలో యాక్షన్ సీన్స్.. పత్యేక ఆకర్షణ

    Feb 24 | శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందుతోంది. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ విభిన్నమైన లుక్ తో... Read more

  • Varun tej s boxing film goes on floors to release on this date

    ‘బాక్సర్’గా రంగంలోకి దిగిన మెగా ప్రిన్స్

    Feb 24 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ తో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న తరువాత తాజాగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమాలో నటిస్తున్నాడు. బాక్సార్ గా టైటిల్... Read more

  • Disha patani s bodyguard pushes photographer and gets into fight

    వీడియో: ఫొటోగ్రాఫర్ ను తోసేసిన దిశా పటానీ బాడీగార్డ్

    Feb 24 | సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే, వాళ్లతో సెల్ఫీలు దిగాలని చూసేవారు, వారి రూపాలను క్లిక్ మనిపించాలని చూసే ఫొటోగ్రాఫర్లు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. ఒక్కోసారి వీరి ప్రవర్తన సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంది కూడా.... Read more

Today on Telugu Wishesh