DSP | Music Copycats | Pawan Kalyan | Sardaar Gabbarsingh

Devi sri prasad talks about sardaar gabbarsingh

DSP Comments on Music Copycats, DSP on Copycats, DSP Comments on Sardaar Gabbarsingh, DSP talks about Sardaar Gabbarsingh, Devi Sri Prasad latest interview, DSP talks about kumari21f, sardaar gabbarsingh, nannaku prematho, stills

Devi Sri Prasad talks about Sardaar Gabbarsingh: South indian rockstar music director devisriprasad latest film sardaar gabbar singh.

దేవి పాటకు సర్దార్ తీన్ మార్ స్టెప్పులు

Posted: 11/24/2015 11:43 AM IST
Devi sri prasad talks about sardaar gabbarsingh

టాలీవుడ్ రాకింగ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ మరోసారి వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. తాజాగా దేవి సంగీతం అందించిన ‘కుమారి21 ఎఫ్’ సినిమా విడుదలై, పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో దేవి కంపోజ్ చేసిన ‘లవ్ చేయ్యలా వద్దా..’ అనే పాటకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో దేవి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సినిమా మంచి విజయం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. తన తర్వాతీ చిత్రాల గురించి చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘నాన్నకు ప్రేమతో’లతో పాటు రామ్ హీరోగా నటిస్తున్న ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా గురించి దేవి మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం మూడు సాంగ్ కంపోజ్ చేసాను. అందులో ఒకటి మాంచి మాస్ బీట్ సాంగ్. ఈ సాంగ్ విని ‘నీ పాటతో నాకు చాలా కిక్ ఇచ్చావ్ దేవి. నువ్వు చేసినదానికన్నా డబుల్ డాన్స్ చేస్తాను’ అంటూ పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి అభినందించారని దేవి చెప్పుకొచ్చాడు.

Video Courtesy : Volga Video

గతంలో దేవి-పవన్ కాంబినేషన్లో ‘జల్సా’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలొచ్చాయి. ఈ హ్యాట్రిక్ హిట్ చిత్రాల తర్వాత మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా ఆడియో అంతకుమించి హిట్ అయ్యే విధంగా దేవి అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడు.

అలాగే ఈమధ్య పలువరు సంగీత దర్శకులు వేరే బాషల సినిమాల నుంచి ట్యూన్స్ కాపీ కొట్టేస్తున్నారని వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ... తనకు కాపీ కొట్టడం అస్సలు ఇష్టం లేదని, ఒకవేళ అలా చేయమని ఎవరైనా అడిగితే ఆ సినిమానే వదులుకుంటానని తెలిపాడు దేవి. తన సినిమాలకు తానే సొంతంగా ట్యూన్స్ కంపోజ్ చేసుకుంటానని చెప్పుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DSP  Music Copycats  pawan kalyan  sardaar gabbarsingh  nannaku prematho  

Other Articles