Super Star Rajinikanth in troubles

Super star rajinikanth in troubles

Rajinikanth in troubles, PMK Petition on Rajinikanth, Rajinikanth latest news, Rajinikanth news, Rajinikanth court issue, Rajinikanth latest updates, Rajinikanth movie news, Rajinikanth movie updates, Rajinikanth stills

Super Star Rajinikanth in troubles: Tamil Super Star Rajinikanth in troubles. PMK Petition on Rajinikanth. Rajinikanth latest news, movies, gossips, stills, gallery.

సూపర్ స్టార్ రజనీపై కోర్టులో పిటీషన్

Posted: 11/20/2015 03:44 PM IST
Super star rajinikanth in troubles

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ పై చెన్నైలోని రాణిపేట మునిసిఫ్ కోర్టులో గురువారం పిటీషన్ దాఖలు అయ్యింది. న్యాయమూర్తులకు వ్యతిరేకంగా రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేసారంటూ పీఎంకే నాయకుడు, న్యాయవాది జానకీరామన్ పిటీషన్ దాఖలు చేసారు.

ఈ పిటీషన్ లో సెప్టెంబర్ 12న చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ న్యాయలోకాన్ని, న్యాయమూర్తుల్లి కించపరిచే విధంగా పరోక్ష వ్యాఖ్యలు చేసారని తెలియజేసారు. దేశంలో రాజకీయాలు బ్రష్టుపట్టినా, ప్రజలు చెడ్బవాళ్లుగా మారినా, న్యాయమూర్తులు నిజాయితీతో వ్యవహరిస్తే దేశం బాగుంటుందని రజనీకాంత్ స్పందించడం వల్ల.. న్యాయమూర్తలను ఎంత అవమానపరుస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ఆ పిటీషన్ లో సూచించారు.

ఈ విషయంపై ముందుగా రాణిపేట పోలీసులకు, తర్వాత జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని.. కానీ వారెవ్వరు చర్యలు తీసుకోని దృష్ట్యా కోర్టును ఆశ్రయించినట్లుగా తన పిటీషన్లు వివరించారు. ఈ పిటీషన్ ను కోర్టు పరిశీలించి, విచారణ చేపట్టనుంది. గత కొద్ది రోజుల క్రితం ఇదే విధంగా న్యాయలోకానికి వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేసారంటూ సినీ రచయిత వైరముత్తుపై కూడా కొందరు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  PMK Petition  Troubles  News  stills  

Other Articles